ఆమనగల్లు(మాడ్గుల) ఏప్రిల్ 29 : మాడ్గుల మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడైన గోవింద్ శ్రీధర్ బ్లాక్ వాయిస్ సం స్థను స్థాపించి నియోజకవర్గంలో చాలా చోట్ల గ్రంథాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు ఓపెన్ జిమ్ లు, యువతకు ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ, ఆపదలో ఉన్న వారి కోసం క్రౌడ్ ఫండింగ్ చేసి ఆదుకోని ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.
రాష్ర్టాభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని భావించిన ఆయన బుధవారం తెలంగాణభవన్‌లో మాడ్గుల మండలంలోని పలు గ్రామాల్లోని తన 200 మంది కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ గోవింద్ శ్రీధర్‌తోపాటు 200 మంది అనుచరులకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.