నందిగామ,మార్చి31 : అన్ని వర్గాల ప్రజలను అర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో రూ.20లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.5లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేద ప్రజల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. తద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, గోవిందు అశోక్, రమేశ్‌గౌడ్, స్వామి, ఎంపీటీసీ కళమ్మ, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్,తదితరులు పాల్గొన్నారు.