గాయత్రీదేవిగా అమ్మవారు
దేవీ నవరాత్రోత్సవాలు షాద్‌నగర్ పట్టణంలో వైభవంగా సాగుతున్నాయి. పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలో సోమవారం అమ్మవా రు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
- వైభవంగా సాగుతున్న దేవీ నవరాత్రులు
- ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
షాద్‌నగర్‌టౌన్, అక్టోబర్ 16: దేవీ నవరాత్రోత్సవాలు షాద్‌నగర్ పట్టణంలో వైభవంగా సాగుతున్నాయి. పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలో సోమవారం అమ్మవా రు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారు పార్వతీదేవి అవతారంలో.. పెద్ద జానమ్మపేట లక్ష్మీవేంకటేశ్వరాలయంలో బాలాత్రిపురాసుందరీదేవిగా దర్శనమిచ్చారు. ఉదయం నుం చే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
కొనసాగుతున్న దసరా నవరాత్రులు
చేవెళ్లటౌన్: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా చేవెళ్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం లో స్వామి వారు సోమవారం ప్రత్యేక పూజలు అందుకున్నారు. మండలకేంద్రంలోని రచ్చబం డవద్ద ప్రతిష్ఠించిన అమ్మవారికి భక్తులు పూజలు చేసి మొక్కు లు చెల్లించుకున్నారు. రెండోరోజు అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు.
గాయత్రీదేవిగా భవానీమాత
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండలంలోని ఎలికట్ట అంబాభవానీ ఆలయంలో భవానీమాతను సోమవారం గాయత్రీదేవిగా అలంకరించారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు రారు. పూజలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎలికట్ట సర్పంచ్ సాయిప్రసాద్, ఆలయ చైర్మన్ కృష్ణయ్య పాల్గొన్నారు.
కొత్తూరు : అమ్మవారి కృప అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్‌యాదవ్ అన్నారు. ఆయ న కొత్తూరు మున్సిపాలిటీ పాత కార్యాలయం వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

