Rangareddy : పాడి రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వండి.. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్

షాద్‌నగర్ : వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంపై రాష్ట్రంలో అన్ని వర్గాల రైతులు సంతోషంగా ఉన్నారని, ఇందులో భాగంగానే పాడి రైతులు వినియోగించే చాప్ కట్టర్ యంత్రాలకు ఉచితంగా విద్యుత్‌ను అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో పాడి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ పొలాల వద్ద, ఆవుల షేడ్ల వద్ద పాడి రైతులు ఏర్పాటు చేసుకున్న చాప్ కట్టర్ యంత్రాలకు విజిలెన్స్ అధికారులు పెద్ద మొత్తంలో జరిమానాలు విధించి కేసులు నమోదు చేస్తున్నారని, ఒక్కొ రైతుకు రూ. 20వేల జరిమానా కూడా విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తు ప్రభుత్వానికి తెలిపారు.
ప్రతి రోజు కేవలం 10నిమిషాల సమయం పాటు చాప్ కట్టర్‌ను వినియోగిస్తారని, విద్యుత్‌ను ఎక్కువగా వినియోగించరని తెలిపారు. నిమిషాల వ్యవధిలో వినియోగించే యంత్రానికి వేల రూపాయల జరిమానాలు కట్టలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అదే విధంగా కేసుల పేరుతో రైతులను సంబంధిత శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే పాడి రైతుల శ్రేయస్సు దృష్ట్యా చాప్‌కట్టర్ వినియోగానికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తే రైతులు బాగుపడుతారని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే లేవనెత్తిన సమస్యపై సంబంధిత శాఖ మంత్రి సానుకులంగా స్పందించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

