Murder | ప్రియురాలు దూరవుతుందేమోనని.. స్నేహితుడిని మట్టుబెట్టాడు
Murder | వాళ్లిద్దరూ స్నేహితులు. ఒకే రూంలో ఉంటారు. ఒక అమ్మాయిని ఆ ఇద్దరూ ప్రేమించారు. అయితే వీరిలో ఒకరు తన స్నేహితుడి ప్రేమలో పడి తననూ నిర్లక్ష్యం చేస్తున్నదని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అంతమొందిస్తేనే తనకు ప్రియురాలు దక్కుతుందని భావించాడు. దీంతో పథ కం ప్రకారం పిలిచి మద్యం తాగించి.. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హత్య చేశాడు. ఈ ఘటన కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్‌లో జరిగింది.
Murder | కొత్తూరు, జూలై 20 : వాళ్లిద్దరూ స్నేహితులు. ఒకే రూంలో ఉంటారు. ఒక అమ్మాయిని ఆ ఇద్దరూ ప్రేమించారు. అయితే వీరిలో ఒకరు తన స్నేహితుడి ప్రేమలో పడి తననూ నిర్లక్ష్యం చేస్తున్నదని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అంతమొందిస్తేనే తనకు ప్రియురాలు దక్కుతుందని భావించాడు. దీంతో పథకం ప్రకారం పిలిచి మద్యం తాగించి.. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హత్య చేశాడు. ఈ ఘటన కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్‌లో జరిగింది. బుధవారం మిస్సిం గ్ కేసుగా నమోదైన రాజ్ కపిల్ సాహు చివరకు హత్యకు గురయ్యాడు. ఈ వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి గురువారం వెల్లడించారు.
కొత్తూరు హెచ్ఏఎల్ కంపెనీలో పని చేస్తున్న రాజ్ కపిల్ సాహు కనిపించడం లేదని కొత్తూరు పోలీస్ స్టేషన్లో బుధవా రం కేసు నమోదైంది. అయితే ఈ నెల 18న రాజ్‌కపిల్ సాహు తన హ్నేహితుడు రాహు ల్ సింగ్ అలియాస్ అమర్నాథ్ను కలుస్తానని వెళ్లాడు. దీంతో పోలీసులు రాహుల్ సింగ్ అలియాస్ అమర్నాథ్ కోసం వెతకగా బుధవారం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో పోలీసుల కంట పడ్డాడు. దీంతో అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పడింది. అయితే రాహుల్ సింగ్, రాజ్‌కపిల్ సాహు, మరో ఇద్దరు మైనర్లు ఒకే రూంలో ఉంటున్నారు. అయితే రాహుల్ సింగ్ ప్రేమిస్తున్న అమ్మాయిని రాజ్ కపిల్ సాహు ప్రేమిస్తున్నాడు.
దీంతో రాహుల్ తన ప్రియురాలు తనతో మునిపటిలా ఉండడంలేదని, తనతో రమ్మంటే రావడంలేదని సాహుపై కక్ష పెంచుకున్నా డు. సాహును చంపితేనే ఆ అమ్మాయి తనకు దక్కుతుందనుకున్నాడు. దీంతో మద్యం తాగడానికి తిమ్మాపూర్ స్టేషన్ రోడ్డులోని జనసాయి వెంచర్‌కు రమ్మని సాహును పిలిచాడు. అక్కడ సాహు తో పాటు రాహుల్‌సింగ్, మహ్మద్ తాహెర్, మరో ఇద్దరు మైనర్లు కలిసి మద్యం తాగారు. అనంతరం పథకం ప్రకారం మద్యం సీసాలతో సా హుపై దాడి చేశారు. సీసాలతో విచక్షణా రహితంగా పొడిచారు. నలుగురు కలిసి బండరాళ్లతో మోది హత్య చేశారు. మృతదేహాన్ని కొంత దూరం తీసుకెళ్లి మట్టితో పూడ్చి వెళ్లిపోయారు. నిందితులను నలుగురిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తు న్నాం. సమావేశంలో శంషాబద్ ఏసీపీ రాంచందర్‌రావు, కొత్తూరు సీఐ శంకర్‌రెడ్డి, ఎస్ఐ శంకర్, ఏఎస్ఐ అబ్దుల్లా పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

