కడ్తాల్, జనవరి 15 : బీఆర్ఎస్ పార్టీపై ఉన్న నమ్మకంతోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరుతున్నారని మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్ అన్నారు. బీజేపీ కడ్తాల్ మండల ఉపాధ్యక్షుడు సరియానాయక్తోపాటు బూత్ కమిటీ అధ్యక్షులు వినోద్, హీర్యానాయక్, కిరణ్‌తోపాటు 10 మంది బీజేపీ నాయకులు బుధవారం బీఆర్ఎస్లో చేరారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు తులసీరాంనాయక్, భూనాథ్నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, మాజీ ఉప సర్పంచ్ రమణ, నాయకులు రమేశ్, శ్రీను, సోమ్లా, దశరథ్, పత్యానాయక్, దేవా, రాజు, కిరణ్ పాల్గొన్నారు.