దోమ, జనవరి 27 : కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని అయినాపూర్ గ్రామానికి చెందిన బుసని బాల్‌రాజ్ ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందగా, ఆయనకు బీఆర్ఎస్ సభ్యత్వం ఉండడంతో పార్టీ నుంచి మం జూరైన రూ.రెండు లక్షల విలువైన చెక్కును శనివారం దోమ జడ్పీటీసీ నాగిరెడ్డితో కలిసి పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మృతుడి భార్య సవర్ణకు అందజేశారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లేశం, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచ్ మల్లేశ్, ఎంపీటీసీ విజయాఆంజనేయులు, పార్టీ నాయకుడు మధుసూదన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ లక్ష్మయ్యముదిరాజ్, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్, పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, గ్రామ అధ్యక్షుడు రుక్మయ్యగౌడ్, శ్రీకాంత్‌రావు, భీమయ్య, బాలయ్య, కృష్ణయ్య, వెంకటయ్య, అంజిలయ్య పాల్గొన్నారు.
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం బండవెల్కిచర్ల గ్రామంలో బాధిత కుటుంబసభ్యులను పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని అన్నారు. అనంతరం మృతుడి భార్య శిరీషాలక్ష్మారెడ్డిని పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ కులకచర్ల మండల నాయకులు పీరంపల్లి రాజు, దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మయ్య ఉన్నారు.