బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి
బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి,
- మాటల గారడి చేసే పార్టీలను నమ్మకండి
- పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
కులకచర్ల, ఏప్రిల్ 29 : బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, పార్టీ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కులకచర్ల, చౌడాపూర్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమ పథకాలు అమలు జరిగాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న చేవెళ్ల ఎంపీ అభ్యర్ధిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని కార్యకర్తలకు సూచించారు.
బీసీలకు అవకాశం…
చేవెళ్ల ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ బీసీలకు కేటాయించిందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బీసీలకు ఎంపీ టీకేట్ కేటాయించడాన్ని ప్రతి బీసీ నేతలు స్వాగతించారని, ఇందుకోసం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పరిగి ప్రాంతానికి దొరికిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించి గెలుపు కోసం సహకరించాలని సూచించారు.
గారడీ చేసే పార్టీలను, నాయకులను నమ్మకండి
ఎన్నికల్లో గారడి చేసే పార్టీలకు, నాయకులను నమ్మరాదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లకోసం వచ్చే నాయకులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త వహించాలని, ఈ విషయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియజేయాల న్నారు.
కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల ఇన్చార్జి రామచందర్‌రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొప్పుల అనిల్‌రెడ్డి, కులకచర్ల జడ్పీటీసీ రాందాస్‌నాయక్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగరాజు, రాజప్ప, సారా శ్రీనివాస్, మాలె కృష్ణయ్యగౌడ్, దామో దర్‌రెడ్డి, అంతారం మొగులయ్య, రఘు, నర్సింహులు, గుండుమల్ల నర్సింహులు, శంకర్‌నాయక్, గండి లక్ష్మయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, చౌడాపూర్ మండల యువజన విభాగం అధ్యక్షుడు మేగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

