అన్నదాతకు కాంగ్రెస్ ధోకా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన కడ్తాల్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణం వద్ద కొద్దిసేపు ఆగారు.
- పాలమూరు బిడ్డను అని గొప్పలు చెప్పుకొంటున్న రేవంత్‌రెడ్డి.. సొంత జిల్లాతోపాటు రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తున్నారు
- మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- కడ్తాల్ మండల కేంద్రంలో కర్షకులతో మాటామంతి
కడ్తాల్, జూన్ 22 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన కడ్తాల్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణం వద్ద కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డితో కలిసి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన యూరియా ఆన్లైన్ బుకింగ్ యాప్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. చిన్న ఫోన్లతో యూరియాను ఎలా బుక్ చేసుకుంటామని, యాసంగిలో రైతుభరోసా పెట్టుబడి డబ్బులు రెండెకరాల వరకే పంపిణీ చేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకొన్నదని.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు నాలుగు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని, కరెంట్ ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియకుండా ఉన్నదని, యూరియాను రైతుల వద్ద అరువు తీసుకుంటున్నామని ఇలా తమ బాధలను అన్నదాతలు వారి ఎదుట చెప్పుకొన్నారు.
కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగున్నదని.. సకాలంలో రైతుబంధు, పాల బిల్లులు వచ్చాయని.. మళ్లీ కేసీఆర్ సర్కారే రావాలని రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డను అని గొప్పలు చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తన సొంత జిల్లా రైతులతోపాటు రాష్ట్రంలోని అన్నదాతలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదని ఆరోపించారు.
అంతకుముందు మండల కేంద్రంలో హరీశ్‌రావుకు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలీ శ్రీనివాస్‌రెడ్డి, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రామకృష్ణ, సర్పంచ్‌లు గోపాల్, శ్రీనూనాయ క్, రమేశ్‌నాయక్, సేవ్యానాయక్, నాయకులు వీరయ్య, శ్రీనుగుప్తా, గణేశ్‌గౌడ్, రవీనాయక్, మహేశ్, లాయక్‌అలీ, రవీందర్‌రెడ్డి, రామచంద్రయ్య, పాండునేత, మహేశ్‌యాదవ్, సాయిలు, చంద్రమౌళి, గణేశ్ పాల్గొన్నారు.
హరీశ్‌రావుకు ఘన స్వాగతం
ఆమనగల్లు : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు వెళ్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుకు ఆమనగల్లు పట్టణంలో బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు పోనుగోటి అర్జున్‌రావు ఆధ్వర్యం లో పార్టీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాకు హరీశ్‌రావు కాన్వాయ్ చేరుకోనే బీఆర్ఎస్ శ్రేణులు భారీగా బాణసంచా కాల్చి నినాదాలతో హోరెత్తించా రు. అనంతరం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు ఆయన్ను శాలువాలతో ఘ నంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జైపాల్‌యాదవ్, కౌన్సిలర్లు రాము, రమేశ్, సర్పంచులు శ్రీనూనాయక్, సత్యం, సయ్యద్ ఖలీల్, నిరంజన్‌గౌడ్ , సైదుల్గౌడ్, ప్రసాద్, పరమే శ్, పంతూనాయక్, వర్షిత్, గణేశ్, రమేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

