కొడంగల్, జూలై 15 : కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నదని మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ఆరోపించారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరుద్యోగుల తరఫున శాంతియుతంగా నిరసన తెలుపుతుం టే ప్రభుత్వం దాడులు చేయిస్తున్నదన్నారు. అర్ధరా త్రి అక్రమంగా అరెస్టు చేసి ఠాణాల్లో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన నిరంకుశంగా సాగుతున్నదని.. భావస్వేచ్ఛను హరిస్తున్నదని ఆరోపించారు. ఇటువంటి అక్రమ అరెస్టులకు పాల్పడితే ప్రజలు సహించారని, సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
తాండూరు : నిరుద్యోగులు తమ డిమాండ్ల కోసం నిరసనలు చేస్తుంటే కాంగ్రెస్ సర్కార్ పోలీసులతో అడ్డుకోవడం సరికాదని గ్రంథాలయ సంస్థ వికారాబాద్ జిల్లా మాజీ చైర్మన్, బీఆర్ఎస్ తాండూరు సీనియర్ నాయకుడు రాజుగౌడ్ అన్నారు. సోమవారం శాంతియుత మార్గంలో సెక్రటేరియట్ ముట్టడికి తలపెట్టిన బీఆర్ఎస్వీ ప్రతినిధులను ముందస్తుగా అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు. బీఆర్ఎస్వీ ప్రతినిధులు దత్తత్రేయ, సందీప్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనివిధంగా కాంగ్రెస్ నీచమైన చర్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కులకచర్ల/పూడూరు : నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడికి బయలు దేరుతున్న బీజేవైఎం పరిగి పరిగి నియోజకవర్గ కన్వీనర్ గడుసు మహిపాల్‌ను కులకచర్ల పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే పూడూరులో బీజేపీ నాయకులు కంకల్ రవీందర్, రాజులు చన్గోముల్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించాలనుకుంటే ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తూ ధర్మమైన ఉద్యమాన్ని అడ్డుకోవడం తగదన్నారు. కార్యక్రమంలో లంబాడ పోరాట హక్కుల సమితి నాయకుడు రమేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.