మొగల్స్ కాలనీలో షార్ట్ సర్క్యూట్
పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మైలార్‌దేవ్‌పల్లిలోని మొఘల్ కాలనీలోని ఓ మూడంతస్తుల భవనంలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పడమే కాకుండా మంటల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడంతో పెద్దసంఖ్యలో ప్రాణ నష్టం తప్పింది.
- 50 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
మైలార్‌దేవ్‌పల్లి, మే 18 : పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మైలార్‌దేవ్‌పల్లిలోని మొఘల్ కాలనీలోని ఓ మూడంతస్తుల భవనంలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పడమే కాకుండా మంటల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడంతో పెద్దసంఖ్యలో ప్రాణ నష్టం తప్పింది. మైలార్ దేవ్‌పల్లి డివిజన్ ఉడ్డెంగడ్డ, మొఘల్స్ కాలనీ ప్రాంతంలో షేక్ మాజీద్‌కు చెందిన మూడంతస్తుల భవనంలో మరో ఏడు కుటుంబాలు అద్దెకుంటున్నాయి.
ఆదివారం ఉదయం భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్ మీటర్ల వద్ద షార్ట్ సర్యూట్ ఏర్పడింది. మంటలు గ్రౌండ్ ఫ్లోర్‌లోని పాత ఫర్నీచర్, ఇతర వస్తువులకు వ్యాపించడంతో భవనంలోని మూడు అంతస్తుల వరకు దట్టమైన పొగ అలుముకుంది. ఒక్కసారిగా మంటలు, పొగల ధాటికి నిద్రలేచి, బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో భవనం టెర్రస్ పైకి పరుగులు తీసి, హాహాకారాలు చేశారు. చాంద్రాయణగుట్ట ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసి.. చిక్కుకుపోయిన 16 మంది పిల్లలు, 34 మంది పెద్దలు, వృద్ధులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చి ప్రాణాలు కాపాడారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

