బొంరాస్‌పేట, ఫిబ్రవరి 13: అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న తమకు పట్టా పాసు పుస్తకాలు ఇప్పించాలని కొత్తూరు, బొంరాస్‌పేట గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ప్రజావాణిలో తహసీల్దార్ షర్మిలకు వినతి పత్రాలు అందజేశారు. కొత్తూరు గ్రామ పరిధిలోని 360 సర్వే నెంబరులో 300 ఎకరాల గైరాన్ భూమిలోని 160 మంది రైతులు సాగు చేసుకుంటుండగా 130 మందికి పట్టా పాసు పుస్తకాలు ఇచ్చారని, మిగతా 30 మందికి పాసు పుస్తకాలు ఇవ్వలేదని రైతులు వినతిపత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా బొంరాస్‌పేట గ్రామ పరిధిలోని 760 సర్వేలో నెంబరులో గైరాన్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు డిజిటల్ పాసు పుస్తకాలు ఇవ్వాలని రైతులు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు చంద్రయ్య, లక్ష్మయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. దుద్యాల, బొంరాస్‌పేట మండలాల్లో తహసీల్దార్లు ప్రజావాణి నిర్వహించి ధరణి సమస్యలపై రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ధరణి సమస్యల పరిష్కారం కోసమే..
పెద్దేముల్, ఫిబ్రవరి 13: ధరణి సమస్యల పరిష్కారం కోసమే మండల తహసీల్దార్ కార్యా లయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. సోమవా రం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ప్రజావాణిలో ధరణికి సంబంధించిన భూ సమస్యలపై మూడు దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజూ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ అవినాష్ పాల్గొన్నారు.
తాండూరులో ఆరు దరఖాస్తులు..
తాండూరు రూరల్: తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణిలో ఆరు దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ చెన్నప్పలనాయుడు తెలిపారు. జిను గుర్తి గ్రామం నుంచి మూడు , చెంగోల్, మాచనూరు, కరణ్‌కోట గ్రామాల నుంచి ఒక్కో ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. వీటి పరిష్కారానికి కృషి చేస్తా మన్నారు.
కొడంగల్‌లో రెండు దరఖాస్తులు..
కొడంగల్: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెండు దరఖాస్తులు అందినట్లు తహసీల్దార్ బుచ్చయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి గాను ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని, రైతులకు సంబంధించిన భూ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవాలని కోరారు. వచ్చిన రెండు దరఖాస్తుల్లో ఒకటి పరిష్కరించామని, మరొక దరఖాస్తును కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్ పాల్గొన్నారు.
మర్పల్లిలో 11 ఫిర్యాదులు
మర్పల్లి: తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 11 ఫిర్యాదులు వ చ్చినట్లు తహసీల్దార్ శ్రీధర్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల 11 మంది వివిధ రకాల భూసమస్యల కోసం ఫిర్యాదు చేశారని వాటిని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది గోపాల్, వీఆర్ఏలు రవి, శ్రీహరి పాల్గొన్నారు.
దోమలో 19 దరఖాస్తులు..
దోమ, ఫిబ్రవరి 13: దోమ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో భాగంగా వివిధ సమస్యలకు సంబంధించిన 19 దరఖాస్తులను స్వీకరించినట్లు డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్ పేర్కొన్నారు.
ధారూరు, ఫిబ్రవరి 13: ధారూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణిలో ఏడు ఫిర్యాదులు అందినట్లు ధారూరు తహసీల్దార్ భువనేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.