కొడంగల్, అక్టోబర్ 17 : అప్పాయిపల్లిలోనే మెడికల్ కళాశాలను నిర్మించాలని అప్పాయిపల్లి మెడికల్ కళాశాల అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (ఏఎండీపీ జేఏసీ), స్థానికులు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటైతే గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించి.. తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్న భూములను ప్రభుత్వానికి ఇచ్చామని.. మెడికల్ కాలేజీని వేరే ప్రాంతానికి తరలిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. శుక్రవారం అప్పాయిపల్లిలోని మెడికల్ కళాశాల తరలింపును నిరసిస్తూ ఏఎండీపీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు, కేడీపీ జేఏసీ నాయకు లు, ఏఎండీపీ జేఏసీ నాయకులు, రైతులు మాట్లాడుతూ.. అప్పాయిపల్లి రైతులు, ప్రజలను మోసం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. మెడికల్ కాలేజీ ఏర్పాటైతే గ్రామం అభివృద్ధి చెందుతుందని, తమకూ ఉపాధి దొరుకుతుందని భావించి బంగారు పంటలు పండే భూ ములను రూ.10 లక్షల నష్టపరిహారాన్ని తీసుకుని ప్రభుత్వానికి ఇచ్చామన్నారు.
అప్పట్లో హుటాహుటిన భూసేకరణ చేపట్టి.. ఇప్పుడేమో గుట్టుచప్పుడు కాకుండా మెడికల్ కళాశాలను ఇతర ప్రాం తానికి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం దారుణమని మండిపడ్డారు. లగచర్లలో చేపట్టిన భూసేకరణలో ప్రభుత్వం ఆ ప్రాంతం వారికి రూ. 20 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందించినా తాము బాధపడలేదని పేర్కొన్నారు. ప్రస్తు తం తమ పరిస్థితి భూములు పాయె.. ఉపాధి లేకపాయె అన్నట్లుగా మారిందని.. ఉన్న భూమి పోవడంతో.. తామంతా ఎలా బతకాలని ఆవేదన వ్య క్తం చేశారు. మెడికల్ కళాశాలను తరలిస్తూ నోటి కాడి కూడును లాక్కునేలా సీఎం వ్యవహరించడం బాధాకరంగా ఉన్నదని.. కొడంగల్ ప్రాంత అభివృద్ధి, ప్రజలపై ఆయనకు ప్రేమ లేదా..? అని ప్రశ్నించారు. కొడంగల్ ఎమ్మెల్యే, సీఎం కావడం తో ఈ సెగ్మెంట్ రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావించామని కానీ, రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలతో తమ ఆశలు ఆవిరి అవుతున్నాయన్నారు. అప్పాయిపల్లిలోనే మెడికల్ కళాశాల నిర్మాణం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. నిరసనలో సురేశ్‌కుమార్, శ్రీనివాస్, మధుసూదన్రావుయాదవ్, రమేశ్‌బా బు, భీమరాజు, శివకుమార్, మధు, రైతులు సం గప్ప, దత్తుసింగ్, వెంకటప్ప, వెంకటయ్య, అమృతప్ప, శ్రీనూనాయక్, రాములుగౌడ్, అశోక్, శివప్రసాద్, కమలమ్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు.