కడ్తాల్, మే 12: మండలంలోని బూత్‌ల్లో ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 24 గ్రామ పంచాయతీల్లో ఇది వరకు 35 ఎన్నికల బూత్‌లు ఉండగా, పెద్దవేములోనిబావి తండాలో 276 ఓటర్లు, గోవిందాయిపల్లి తండా 797 ఓటర్లు, గడ్డమీది తండా 319 ఓటర్లు ఉండగా, తాజాగా మూడు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసిన్నట్లు తహసీల్దార్ ముంతాజ్ తెలిపారు. మండలంలో మొత్తం ఓటర్లు 33,723 ఓటర్లకుగానూ పురుషులు 17,297 మంది, స్త్రీలు 16,425 మంది, ఇతరులు ఒకరు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల్లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. అన్ని పోలింగ్ బూత్‌లకు ఎన్నికల అధికారులు ఈవీఏంలు, ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : లోక్‌సభ ఎన్నికలకు మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తహసీల్దార్ రవీందర్దత్తు తెలిపారు. మండలంలో మొత్తం 1,78,188 మంది ఓటర్లు ఉండగా 163 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పురుషులు 90,281 మంది, మహిళలు 87,877 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఓటరు కార్డు లేనిచో ఈసీ నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని వెంట తెచ్చుకొని ఓటు వేయవచ్చన్నారు. ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, ఉపాధిహామీ జాబ్‌కార్డు, ఫొటోతో ఉన్న పోస్టాఫీస్/బ్యాంక్ పాస్‌బుక్,

కార్మిక మంత్రిత్వశాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సురెన్స్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, లేబర్ గుర్తింపుకార్డు, ఇండియన్ పాస్‌పోర్టు, ఫొటోతో ఉన్న ఫెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపుకార్డు తదితర వాటిలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని సూచించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా, సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ జరిపేలా ఏర్పాట్లు చేశామన్నారు.
ఆదిబట్ల : నేడు జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాట్లను పూర్తి చేశామని ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు 16 పోలింగ్ బూత్‌లు, 9 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కోరారు.
పెద్దఅంబర్‌పేట : పార్లమెంట్ ఎన్నికల కోసం మున్సిపాలిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పెద్దఅంబర్‌పేట, పసుమాముల, కుంట్లూరు, తట్టిఅన్నారం, మర్రిపల్లిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఎన్నికల కోసం ఈవీఎంలతో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
మండలంలో మూడు మాడల్ పోలింగ్ స్టేషన్లు
మొయినాబాద్ : పోలీంగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్‌లను ఏర్పాటు చేసుకున్నారు. మండలంలో 65 పోలీంగ్ బూత్‌లు ఉండగా వాటిని పర్యవేక్షించడానికి 5 రూట్లను ఏర్పాటు చేశారు.
మండలంలో అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్, ఎతుబార్పల్లి గ్రామాల్లో పోలింగ్ బూత్‌ను మాడల్ పోలింగ్ స్టేషన్లుగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ గౌతంకుమార్, ఆర్ఐ చంద్రమోహన్లు పర్యవేక్షించారు.

నందిగామ : మండలంలో 26854 ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 13388, మహిళలు 13463, ఇతరులు ముగ్గురు ఉన్నారు. మొత్తం 27 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మయ్య తెలిపారు.
యాచారం : మండలంలో 59పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. 24గ్రామపంచాయతీలకు 48,656 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 24,351మంది పురుషులు ఉండగా 24,351మంది స్త్రీలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నట్లు తహసీల్దార్ అయ్యప్ప తెలిపారు. సీఐ శంకర్‌కుమార్, ఎస్ఐ గోపాల్, వెంకటనారాయణ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆమనగల్లు : కల్వకుర్తి నియోజకవర్గంలో ఏడు మండలాలు రెండు పురపాలిక సంఘాల్లో 244405 ఓటర్లు ఉండగా, పురుషులు 123434, మహిళలు 120970, ఇతరులు ఒకరు ఉన్నారు. 271 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల్లో 1705 మంది సిబ్బందిని నియమించింది.
ఆమనగల్లు మండలంలో 31381 ఓటర్లు ఉండగా పురుషులు 15705, మహిళలు 15676 మంది ఓటర్లు ఉన్నారు. మాడ్గుల మండలంలో మొత్తం 44189 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 22541, మహిళలు 21648 ఉన్నారు. కడ్తాల్ మండలంలో 33723 ఓటర్లు ఉండగా పురుషులు 17297, మహిళ ఓటర్లు 16425 ఉన్నారు. తలకొండపల్లి మండలంలో మొత్తం ఓటర్లు 37365 మంది ఉండగా పురుషులు 18890, మహిళ ఓటర్లు 18475 మంది ఉన్నట్లు తహసీల్దార్ లలిత తెలిపారు.