కడ్తాల్, జనవరి 20 : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన శిల్పకు రూ.40 వేల సీఎం సహాయనిధి చెక్కు మంజూరైం ది. గురువారం హైదరాబాద్‌లోని ఎమ్మె ల్సీ నివాసంలో లబ్ధిదారురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం థకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, నాయకులు సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, జహంగీర్‌అలీ, ప్రభులింగం పాల్గొన్నారు.
పేదప్రజలకు అండగా సీఎం సహాయనిధి
ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పేదప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరుకు చెందిన ఎరుకల ఊహకు రూ.32 వేలు, యాచారం మండలం గడ్డమల్లయ్యగూడ గ్రామానికి చెందిన దండు జంగయ్యకు రూ.60 వేల చొప్పున సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను గురువారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సదానంద్‌గౌడ్, తిరుమల్‌రెడ్డి, దర్శన్‌గౌడ్, ఎరుకల ప్రసాద్‌గౌడ్, మాజీ సర్పంచ్ నర్రె మల్లేశ్, నాయకులు బీరప్ప, రామలింగారెడ్డి, జంగయ్య తదితరులున్నారు.
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం
కేశంపేట : నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్‌ఫండ్ వరం గా మారిందని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఇప్పలపల్లికి చెందిన పిప్పళ్ల బాలమణి కుటుంబ సభ్యులకు రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎక్లాస్‌ఖాన్‌పేటలో అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, చంద్రమౌళి, రాములు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
షాద్‌నగర్‌టౌన్, జనవరి 20: నిరుపేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా మున్సిపాలిటీలోని శ్రీనగర్‌కాలనీ కాలనీకి చెందిన ఎం.డి యూసుఫ్ షరీఫ్‌కు రూ. 1.25 లక్షలు, ఫరూఖ్‌నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన నేనావత్బాయికి రూ. 60 వేల సీఎం సహాయనిధి చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు యుగేందర్, బాలు పాల్గొన్నారు.