వికారాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : జిల్లా ఖజానా శాఖ కార్యాలయంపై పర్యవేక్షణ కరువైంది. ఏదైనా పని పూర్తి కావాలం టే పైసల్ ఇవ్వాల్సిందే.. లేకుంటే సంబంధిత పనిని, బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నా రన్న ఆరోపణలున్నాయి. కలెక్టరేట్లోనే జిల్లా ట్రెజరీ కార్యాలయమున్నా సంబంధిత శాఖలోని లంచావతారులపై నిఘా లేకుండా పోవడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదలుకొని వారి పిల్లల చదువు కోసం తీసుకునే రుణాలు, కాంట్రాక్లర్లకు బిల్లుల చెల్లింపుల వరకు అంతా ట్రెజరీ శాఖ ద్వారానే జరుగుతుంది.
ఉద్యోగుల జీతాలు, ఇంక్రిమెంట్లు, ఏరియర్స్, సరెండర్ పీఎఫ్ లు, ఉద్యోగుల ఉద్యోగవిరమణ అనంతరం వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల వరకు పర్సంటేజీ లేనిదే పనిచేయడం లేదనే ఆరోపణలు జిల్లా ట్రెజరీతోపాటు సబ్ ట్రెజ రీ అధికారులపై వెల్లువెత్తుతున్నాయి.
డీటీవో కార్యాలయంతోపాటు ఎస్టీవో కార్యాలయా ల్లో పనిచేసే అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్ల వరకు ఒక్కొక్కరికీ ఒక్కో రేటు ఇవ్వాలనే తంతు ఆయా కార్యాలయాల్లో కొనసాగుతున్నది. డీటీవో, ఎస్టీవో కార్యాలయాల్లో నడుస్తున్న లంచాల వ్యవహారం తెలిసిన వారు తప్పని పరిస్థితుల్లో పైసలిచ్చి పనులు చేసుకుంటుండగా, పైసలివ్వని వారు ట్రెజరీ ల చుట్టూ రోజుల తరబడిగా ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా ట్రె జరీతో పాటు సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ అవినీతి తంతు జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారమూ జరుగుతున్నది. !
జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాల్లో పైసలివ్వనిదే ఏ పని జరగడం లేదనే ఆరోపణలున్నాయి. అధికారులు మొదలుకొని కిందిస్థాయి ఉద్యోగుల వరకు అందరికీ వారు నిర్ణయించిన పర్సంటేజీ ప్రకారం పైసలు ముట్టజెప్పనిదే పని కాదని పలువురు ఉద్యో గులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇం క్రిమెంట్ ఫైల్ అయితే ఓ రేటు, బ్యాంకు రుణాలకు సంబంధించి అయితే మరో రేటు, కాంట్రాక్టర్ల బిల్లులను బట్టి ఓ రేటును ఫిక్స్ చేసి మరీ ట్రెజరీ అధికారులు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే ఆ పని పెండింగ్‌లో పడిపోవడం ఖాయమని వారు పేర్కొంటున్నారు. కాగా, ఓ జిల్లా అధికారి తన కొడుకును విదేశాల్లో చదివించేందుకు పెట్టుకున్న బ్యాంకు రుణానికి సంబంధించిన ఫైల్‌కు కూడా పది శాతం పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో ఏమి చేయలేక సదరు అధికారి వారు అడిగినంత డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా, కొందరు జిల్లా అధికారులు సొంత వాహనాలను వినియోగిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే అలవెన్స్‌లను పొందడం, మరికొంత మంది అధికారులు ప్రభుత్వ వాహనాలను వాడు తూ.. సొంత వాహనాలను కూడా వినియోగిస్తున్నట్లు తప్పుడు బిల్లులు పెట్టి వెహికల్ అలవెన్స్‌లు పొందుతున్నారనే ప్రచారం జోరుగా ఉన్నది.
ఈ వెహికల్ అలవెన్స్ ఫైల్ అప్రూవల్ కోసం ప్రతినెలా రూ.4-5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు .. కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలోనూ బిల్లులను బట్టి పర్స ంటేజీని డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చే అలవెన్స్‌ల కోసం ట్రెజరీ కార్యాలయా ల్లో వారి వివరాలను ఆన్లైన్ చేస్తేనే అలవెన్స్‌లు మంజూరవుతాయి. అయితే వాటిని ఆన్లైన్ చేసేందుకు కూడా ట్రెజరీ అధికారుల చేతులు తడపాల్సిందేనని బాధితులు పేర్కొంటున్నారు.