వారాంతపు సంబురాల్లో సంతోషాన్నే కాదు.. ఖర్చునూ షేర్ చేసుకుంటున్నారు ఉద్యోగులు. నిత్యం పనితో కుస్తీ పడే వివిధ విభాగాల్లోని ఉద్యోగులు.. కొలిగ్లు, స్నేహితులు వీకెండ్ సంబురాల్లో ఖర్చు ఏ ఒక్కరికో భారం కాకుండా వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. వారి వారి అలవాట్లు, అభిరుచులను బట్టి బిల్లులను ‘స్లిట్’ చేయిస్తున్నారు. దీంతో సమూహంగా ఉన్నా ఎవరి ఖర్చు వాళ్లే చెల్లించే వెసులుబాటు ఉంటున్నది. వారాంతాలు ఎక్కడికి వెళ్లాలో ఎప్పటికప్పుడు వాట్పాప్ గ్రూపుల్లో అభిప్రా యాలు వ్యక్తం చేస్తూ నిర్ణయం తీసుకుంటు న్నారు. ఎంత ఎక్కువ మంది ఉన్నా ఖర్చుభారం కాకపోవడంతో పెద్దసంఖ్యలో స్నేహితులు వీకెండ్ మస్తీలో పాలుపంచుకుంటున్నారు.
పొద్దున 6 గంటలకే లేవాలి. నాలుగు చెంబులు నీళ్లు పోసుకోవాలి. వేడివేడి టిఫిన్‌ను గబగబా కడుపులో వేసేసి ఉద్యోగానికి పరుగులు తీయాలి. ఆపై కంప్యూటర్ స్క్రీన్‌ను చూస్తూ పనిచేయాలి.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదురోజులపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవన శైలి ఇదే. అందుకే వారంలో మిగిలిన ఆ రెండు రోజులను ఆస్వాదించేందుకు వారు ఇష్టపడుతున్నారు. పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 24: ఫ్యామిలీస్‌తో కలిసి ఉద్యోగులు వీకెండ్ టూర్లకు వెళ్తున్నారు. నగర శివారులోని గెస్ట్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లను బుక్ చేసు కుని పిల్లలు, తోటి ఉద్యోగులతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. ఒత్తిడిని దూరం చేస్తున్నారు. ఖర్చులను షేర్ చేసుకుంటున్నారు. చాలాచోట్ల కేవ లం ఉద్యోగులు కూడా టూర్లకు వెళ్తున్నారు.
ఐదు రోజులపాటు బిజీగా ఉండే ఉద్యోగులు శని, ఆదివారాల్లో స్వేచ్ఛావాయువును పీల్చుకునేందుకు పరితపిస్తున్నారు. తోటి ఉద్యోగులంతా బృందాలు గా టూర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. భా ర్యాపిల్లలను తీసుకుని బయటకు వెళ్తున్నారు. అం దుకోసం పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దాదాపు 10 కుటుంబాల వారు ఒకే చోట ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. సంతోషాలు, తీపి గుర్తులను పంచుకుంటున్నారు. పిల్లలతో సరదాగా ఆడుకుంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు, టీమ్ లీడర్లు, మేనేజర్లతో చీవాట్లను మరిచిపోయేలా ఎంజాయ్ చేస్తున్నారు.
వారాంతాల్లో తమకు నచ్చిన, మెచ్చిన ఆహార పదార్థాలను తీనేందుకు ఇష్టపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా చర్చించుకుని ఫుడ్ ఐటమ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. కొందరు మాత్రం వెళ్లాలనుకు న్న ప్రదేశానికి ఒక్కొక్కరు వారి ఇంటి నుంచి ఒక్కో ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకరు వెజ్ కర్రీ తెస్తే… మరొకరు నాన్‌వెజ్ తెచ్చేలా, మరి కొందరు స్నాక్స్, స్వీట్స్ తీసుకొచ్చేలా రెడీ అవుతున్నారు. చాలామంది మాత్రం వీకెండ్ ‘ఇంట్లో వం ట ముచ్చటే లేదు’ అని తేల్చి చెప్పేస్తున్నారు. ఆయా రిసార్ట్స్‌లు, గెస్ట్‌హౌస్‌ల సమీపంలోని బెస్ట్ రెస్టారెంట్లను సెర్చ్ చేసి ముందే ఆర్డర్ ఇచ్చేస్తున్నారు.
రిసార్ట్స్‌ల్లో ఏర్పాటు చేస్తున్న మ్యూజిక్ సిస్టం వద్ద ఉద్యోగులు.. తమ కుటుంబసభ్యులతో కలిసి స్టెప్పు లు వేస్తున్నారు. కొందరు సరదాగా పోటీలు పెట్టుకుంటున్నారు. ఇష్టమైన పాటలకు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్నారు. పిల్లలు స్టెప్పులు వేస్తుంటే చప్పట్లు కొడుతూ సంబురపడుతున్నారు. రిసార్ట్స్‌ల్లో కల్పిస్తున్న సౌకర్యాలను బట్టి వాటికి రేట్లు డిసైడ్ చేస్తున్నారు. నగర శివారులో తక్కువలో తక్కువ ఒక్కో రిసార్ట్స్‌కు రూ. 10 వేల నుంచి 50 వేల వరకు చా ర్జి చేస్తున్నారు. అయితే, అందుకు తగ్గట్టు వసతులు సైతం కల్పిస్తున్నా రు. స్విమ్మింగ్ ఫూల్, రెయిన్ డ్యా న్స్, మ్యూజిక్ సిస్టం సౌకర్యాలు కల్పిస్తుండగా.. కొన్నిచోట్ల మినీ థియేటర్లు సైతం అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఉదయం 11 గంటలకు స్నాక్స్ మొద లు.. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం టీ, స్నా క్స్, రాత్రి డిన్నర్ వరకు ఇలా ఎంచుకునే ప్యాకేజీలను బట్టి చార్జీలను ఫిక్స్ చేస్తున్నారు. ఒకేసారి బృందంగా కుటుంబ సభ్యులతో వెళ్తున్న ఉద్యోగులు సంతోషాలనే కాదు, టూర్‌కు అవుతున్న ఖర్చులను సైతం షేర్ చేసుకుంటున్నారు. ముందు ఒకరే బుక్ చేస్తున్నా.. ఆపై అందరూ సమానంగా చెల్లిస్తున్నారు. అయితే, చాలాచోట్ల కేవలం ఉద్యోగులే టూర్లకు వెళ్తున్నారు. ఉద్యోగ జీవితంలో ఎదుర య్యే కష్టసుఖాలను షేర్ చేసుకుంటున్నారు. వీకెండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
నేను గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. ఐదు రోజులపాటు ట్రాఫిక్‌లో జర్నీతో చిరా కు వస్తుంది. పొద్దున వెళ్తే రాత్రి ఎప్పు డు వస్తామో కూడా తెలియదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే వీకెండ్ కోసం ఎదురుచూస్తా. శని, ఆదివారాలు కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేందుకు ఇష్టపడుతా. వీకెండ్ గురించి శుక్రవారం రాత్రే ప్లాన్ చేసుకుని, వన్డే టూర్లకు వెళ్తుంటా. పిల్లలతో ఆనందంగా గడుపుతా. మళ్లీ సోమవారం నుంచి శరామామూలే.
– ఆదిత్య, సాఫ్ట్వేర్ ఉద్యోగి