షాబాద్, సెప్టెంబర్ 24: శాస్త్రీయ పద్ధతుల ద్వారా డెయిరీ సాగు చేపడితే అధిక లాభాలు పొందే అవకాశం ఉందని పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ కొండల్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్లో బుధవారం పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా డెయిరీ సాగు, పాల ఉత్పత్తుల విలువ జోడింపుపై ఆస్ట్రేలియా రాయబారి కార్యాలయం ప్రత్యక్ష సహాయం కార్యక్రమంలో భాగంగా రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
రైతులు అధికారుల సలహాలు, సూచనలు పాటించి పాల ఉత్పత్తిలో అధిక లాభాలు పొందాలని సూచించారు. అనంతరం మహిళా పాడి రైతులకు ధృవ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు యాదయ్య, మాణిక్యం, రాములు, శ్రీనివాస్, రాజు, గౌరీశ్వర్, మహేశ్, పూర్ణచందర్, రమ్య, స్వరూప, యజ్ఞశ్రీ, పద్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.