తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, అతని జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే యాదయ్య తదితరులు అన్నారు. మంగళవారం కొమురయ్య వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్, కురుమ సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కొమురయ్య చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు.
చేవెళ్లటౌన్, జూలై 4: దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక కొమురయ్య అని అన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొమురయ్య చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ శైలజ, ఎంపీటీసీలు వసంతం, రాములు, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, కురుమ సంఘం చేవెళ్ల మండల అధ్యక్షుడు వెంకటేశం, ఉపాధ్యక్షులు సతీశ్, ఎర్ర మల్లేశ్, సాయినాథ్ పాల్గొన్నారు.
కడ్తాల్ : సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం మరవలేనిదని జడ్పీటీసీ దశరథ్‌నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, పీఏసీఎస్, ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేశ్, సేవ్యానాయక్, లాయక్‌అలీ, నాయకులు యాదయ్య, చంద్రశేఖర్, కృష్ణయ్య, మల్లయ్య, లక్ష్మణ్, రమేశ్, యాదయ్య పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : దొడ్డి కొమురయ్య ఎంతోమందికి స్ఫూర్తి అని కురుమ సంఘం తుర్కయాంజాల్ అధ్యక్షుడు బాబయ్య అన్నారు. మున్సిపాలిటీ చౌరస్తాలో కొమురయ్య వర్ధ్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమేశ్, సంఘం డైరెక్టర్లు రాజు, కొమురయ్య, యువజన విభాగం అధ్యక్షుడు రవీందర్, నాయకులు శంకర్, దర్శన్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో..
పెద్దఅంబర్‌పేట :మున్సిపాలిటీ 12వ వార్డు పరిధిలోని రావినారాయణరెడ్డి కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. కొమురయ్య భూమి కోసం, భుక్తి కోసం, జాతి విముక్తికి పోరాడిన యోధుడని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్ పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని చేవెళ్ల మండల పరిధిలోని గ్రామాల్లో నిర్వహించారు.ఆలూర్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు గోపులారం పోచమ్మ, నరేందర్ చారి, గ్రామస్తులు అశోక్, ప్రదీప్ పాల్గొన్నారు.
కలెక్టరేట్లో ..
షాబాద్ : కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగ మల్లేశ్‌యాదవ్ హాజరయ్యారు. కొమురయ్య పోరాట స్ఫూర్తిని వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శివకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్, ఆదిబట్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జంగయ్య, మాజీ జడ్పీటీసీ ఐలయ్య, బీఆర్ఎస్ మంచాల మండల అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.
మొయినాబాద్ : మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మహేందర్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు దర్గ నరేందర్, నాయకులు మాణిక్యం, పాండు, మల్లేశ్, మహేశ్, శ్రీశైలం, మనోజ్, పాండు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై..
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య విగ్రహ కమిటీ చైర్మన్ మంగ వెంకటేశ్, బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేశ్, మాజీ జడ్పీటీసీ ఐలయ్య, నాయకులు శివకుమార్, మంగమ్మ, చీరాల రమేశ్, రఘుపతి, గణేశ్, చంద్రయ్య, కాల్లె బీరప్ప, ఐలయ్య పాల్గొన్నారు.