బడంగ్‌పేట, నవంబర్ 24 : తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య అని, ఆయన త్యాగం వెలకట్టలేనిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్టపై మీర్‌పేట కురుమ సంఘం అధ్యక్షుడు మహేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆదివారం ఆమె ఆవిష్కరించి మాట్లాడుతూ..చందన చెరువు కట్టపై మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టమన్నారు. అదేవిధంగా ఇటీవల మృతి చెందిన నరేశ్‌కుమార్ కుటుంబాన్ని ఆమె పరామర్శించి.. ఏఅండ్ఎం టూవీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సమకూర్చిన రూ. 20 లక్షలను నరేశ్‌కుమార్ కుటుంబానికి అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు పద్మా భాస్క ర్‌రెడ్డి, లావణ్య, మౌనిక, భూపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్, నవీన్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, దీప్లాల్ చౌహాన్, కామేశ్‌రెడ్డి, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నరేందర్‌యాదవ్, సతీశ్‌రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.