రంగారెడ్డి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని మల్కాపూర్ గ్రామ పరిధిలో అటవీ శాఖ నిర్వహించిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొని మొక్కను నాటి నీరు పోశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవకో టి మనుగడకు మొక్కలే ఆధారమ ని, పర్యావరణ సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఈ ఏడాది 20 హెక్టార్లలో 33,500 మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 20 వేల మొక్క లు నాటినట్లు అటవీ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అటవీశాఖ అధికారితో కలిసి నడక దారిన వెళ్లిన కలెక్టర్ ఐదేండ్ల కింద నాటిన మొక్కలు, ప్లాంటేషన్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో చార్మినార్ సర్కిల్ కన్జర్వేటర్ సివాల రాంబాబు, డీఎఫ్‌వో సుధాకర్‌రెడ్డి, ఎఫ్‌డీవో వియానందరావు, ఎఫ్ఆర్వో ఇరిషాద్ పాల్గొన్నారు.
షాద్‌నగర్ టౌన్, ఆగస్టు 9: షాద్‌నగర్ ము న్సిపాలిటీలో కొనసాగుతున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ఆర్డీఎంఏ(రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్టేష్రన్)ఆఫీసర్ శ్రీనివాస్‌రావు శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మున్సిపల్ కమిషనర్ వెంకన్నను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డంపింగ్‌యార్డు వద్ద జరుగుతున్న బయోమైనింగ్ పనులను పర్యవేక్షించడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, పీహెచ్‌సీలు, బస్టాండ్‌లో చేపట్టిన శుభ్రత కార్యక్రమాలు, నర్సరీని పరిశీలించా రు. స్వచ్ఛతను అందరూ పాటించాలన్నారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమం గురించి మహిళా సంఘాలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ సం పు వద్ద మొక్క నాటి నీరు పోశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. ఫ్రై డే డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో భార్య మహేశ్వరితో కలిసి ఆయన స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. పూల మొక్కల కుండీలను శుభ్రం చేశారు.
వికారాబాద్, ఆగస్టు 9 : మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’లో భాగంగా వికారాబాద్ జిల్లా కొండాపూర్, అనంతగిరి అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవంలో ఆయన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జైదుపల్లి పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ… భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకుంటారని అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా కమిషనర్ , కలెక్టర్ అధికారులతో కలిసి అటవీ ప్రాంతంలోని హిల్ వ్యూ పాయింట్ నుంచి అటవీ అం దాలను తిలకించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞా నేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీవైఎస్వో హనుమంతరావు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ్, జిల్లా సూపరింటెండెంట్ విజయ భాస్కర్, ఆబ్కారీ, అటవీ శాఖ అధికారులు, జైదుపల్లి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ శుక్రవారం జిల్లాలో ఎక్సైజ్‌శాఖ ఏర్పా టు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట పూడూరులోని బృందావన్ డిస్టిలరీ ని పరిశీలించారు. అక్కడి నుంచి వన మహోత్సవంలో పాల్గొని మొక్కను నాటారు. ఆ తర్వాత జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో పాల్గొని ఎక్సైజ్ క్రైమ్, రెవెన్యూ విషయాలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
చేవెళ్ల రూరల్ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రం గారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండలం లోని మోకిల గ్రామంలోని రైతువేదిక వద్ద, మున్సిపల్ పరిధి బుల్కాపూర్లోని 4,5 వార్డుల్లో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆమె మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం మాట్లాడు తూ.. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ సందర్భంగా బుల్కాపూర్లోని డంపింగ్‌యార్డు, మోకిలాలోని క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతివనం, హరితహారం నర్సరీలను పరిశీలించి వాటి నిర్వహణ బా గుందని అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో వెంకయ్యగౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, ఎంపీవో రాజు, శంకర్పల్లి మండల ప్రత్యేకాధికారి రమాదేవి, ఎంఈవో అక్బర్, మోకిలా, దొంతాన్పల్లి గ్రామాల పంచాయతీ సెక్రటరీలు ప్రమీల, రియాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
మంచాల : కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జాన్‌వెస్లీ అన్నారు. స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయ న మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి తాగునీటి ట్యాంకులు, పల్లెప్రకృతి వనాలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ముందుగా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత శుభ్రతతో సీజనల్ వ్యాధులను అరికట్టొచ్చన్నారు. కార్యక్రమంలో మంచాల మండల ప్రత్యేకాధికారిణి సుభాషిణి, ఎంపీడీవో బాలశంకర్ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
యాచారం, ఆగస్టు 9 : పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించాలని రంగారెడ్డి డీఆర్డీవో పీడీ శ్రీలత అన్నారు. మండలంలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గున్గల్ గ్రామంలో 75 వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థాని క అధికారులతో కలిసి మొక్క నాటి మాట్లాడారు. వనమహోత్సవంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. గ్రామాల్లోని వీధు లు, మురుగు కాల్వలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల ఆవరణలు, రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. జనా వాసాల మధ్య దోమలను నివారించి సీజనల్ వ్యాధులను అరికట్టాలన్నారు. ము ఖ్యంగా ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించాలన్నారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తబుట్టలను ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, ఎంపీవో శ్రీలత, వ్యవసాయ అధికారి సందీప్, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్ : మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి సా మాజిక బాధ్యత అని రంగారెడ్డి జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి అన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మండలంలోని పోల్కంపల్లి, నాగన్‌పల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడు తూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించాలన్నారు. ప్రతి గ్రామంలోనూ ఆరు వేల మొక్కలకు తగ్గకుండా నాటాలని సూచించారు. రైతులు తమ పొలంగట్ల వెంట ఆదాయాన్ని సమకూర్చే పండ్లు, టే కు, వేప తదితర మొక్కలను నా టుకోవాలన్నారు. నాగన్‌పల్లి, పో ల్కంపల్లి గ్రామాల్లో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం కింద చేపట్టిన పలు రకాల పనులను ఆయన ప్రత్యేకాధికారి నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటమ్మలతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో లక్పతినాయక్, ఏపీవో తిరుపతాచారి, పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.