అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 7 : అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమవుతున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. రూ. 30 లక్షలతో చేపట్టనున్న మండల కేంద్రంలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ రోడ్డు విస్తరణ పనులు, అనాజ్‌పూర్‌లో రూ. 1.43 కోట్లతో సీసీ రోడ్లు, షాపింగ్ కాంప్లెక్స్ భవనాలను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. మిగిలి ఉన్న పనులను త్వరలోనే దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు.
లష్కర్‌గూడ వంతెన నిర్మాణానికి సీఎం కేసీఆర్, సంబంధిత మంత్రిని కలవడంతో రూ. 5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రేఖ, సర్పంచ్‌లు కిరణ్‌కుమార్‌గౌడ్, కావలి రంగయ్య, ఎంపీటీసీ రాచపాక లావణ్య, కేశెట్టి వెంకటేశ్, సీక సాయికుమార్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ అక్బర్ అలీ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, సర్పంచ్‌లు పోచంపల్లి సుధాకర్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్‌పాష, నాయకులు మహేందర్‌గౌడ్, కిషన్‌గౌడ్, చక్రవర్తిగౌడ్, జీవన్‌కుమార్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
యాచారం : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో బుధవారం జిల్లా పరిషత్ నిధులు రూ. 7.5లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఆసరా, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
మండలంలోని ప్రతి గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీ, విద్యా, వైద్యం, విద్యుత్ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, సర్పంచ్ బండిమీది కృష్ణ, ఎంపీటీసీ తాండ్ర లక్ష్మమ్మ, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, పంచాయతీరాజ్ ఏఈ ఉస్మాన్, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యాదయ్య, గోపాల్, లక్ష్మణ్, లింగం తదితరులున్నారు.