e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home రంగారెడ్డి crime : వృద్ధురాలి మెడలో నుంచి బంగారం అపహరణ

crime : వృద్ధురాలి మెడలో నుంచి బంగారం అపహరణ

యాచారం : వృద్ధురాలి మెడలో నుంచి 4 తులాల బంగారం గుర్తు తెలియని దుండగులు అపహరించుకు పోయిన సంఘటన మండలంలోని మొగుళ్లవంపు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. మండల కేంద్రానికి అనుబందంగా ఉన్న మొగుళ్లవంపు గ్రామానికి చెందిన లక్ష్మిభాయి అనే వృద్ధురా లు బీపీ గోలీల కోసం యాచారం కాలినడకన వస్తుంది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెను పలకరించాడు. అమ్మమ్మ ఇది ఏఊరు అంటూ మాటల్లో దింపి వెనకాల నుంచి ఆమె మెడలో ఉన్న సుమారు 4తులాల బంగారు ఆభరణలను బలంగా లాక్కుని అప్పటికే అతని అనుచరుడు ద్విచక్రవాహనంతో రెడీగా ఉండటంతో ఆ బైకుపై పారిపోయారు.

- Advertisement -

బంగారం లాక్కుని పోవడంతో లక్ష్మీభాయి బోరున విలపించింది. ఆమె గోడు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వైన్స్​‍ వద్ద ఉన్న సీసీ కెమెరాలో సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement