ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 12 : ఇబ్రహీంపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం సమస్యల సుడి గుండంలో కొట్టుమిట్టాడుతున్నది. రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదు. పరిస్థితి అధ్వా నంగా మారిందని రోగులు, వారి సహాయకులు ఆరోపిస్తు న్నారు. మరో వైపు డయాలసిస్ సెంటర్ ఉన్నా నీటి కొరతతో రోగులకు సరైన సేవలు అందడం లేదు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. సాయంత్రం అయిందంటే నర్సులే ఫోన్ల ద్వారా డాక్టర్లను సంప్రదించి రోగులకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం మాత్రమే ఓపీ సేవలు అందిస్తూ.. సాయంత్రం నిలిపేశారు. ఆసుపత్రిలో ఐదుగురు డాక్టర్లు, సూపరింటెండెంట్ ఉన్నా రాత్రి పూట వైద్యం స్టాఫ్ నర్సులే చేయాల్సి వస్తున్నది.
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో రోగులు, వారి సహాయకులు ఇబ్బంది పడుతున్నారు. డయాలసిస్ సేవలు అందించేందుకు నీరు చాలా అవసరం. సరిపడా లేకపోవడంతో ఆస్పత్రికి దూరంగా ఉన్నా పోస్టుమార్టం గది వద్ద ఉన్న బోరు నుంచి వస్తున్న కొద్దిపాటి నీటిని డయాలసిస్ రోగులకు వాడుతున్నారు. దవాఖానలోని ఇతర రోగులకు, సిబ్బందికి నీరు లేక పోవడంతో ట్యాంకర్ల ద్వారా తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మందుల కొరత వెంటాడుతున్నది. రోగులకు సరిపడా మందులు అందడంలేదని ఆరోపణలు న్నా యి. ఇటీవల వీధి కుక్కల బారినపడి ఆస్పత్రికి వెళ్లిన వారికి సకాలంలో టీటీ ఇంజెక్షన్లు లేకపోవడంతో ఆ బాధితులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే, విషజ్వరాలతో ఆస్పత్రికి వచ్చిన వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆస్పత్రిలో జ్వరం, జలుబు, ఒళ్లు నొ ప్పులు, ఇతర విషజ్వరాలకు సంబంధించిన మందులు అందుబాటులో లేకపోవడంలో ప్రైవేట్ మెడికల్ షాపులు, ప్రైవేట్ దవాఖానలకు వెళ్లాల్సిన దుస్థితి ఉన్నది. ఆస్పత్రిలోని సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యేకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రోగులు, స్థానికులు పేర్కొంటున్నారు.
ఇబ్రహీంపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్యం అందడంలేదు. ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, సిబ్బంది లేరు. మందుల కొరత రోగులను వేధిస్తున్నది. నీటి కొరతతో రోగు లు, ఆస్పత్రి ఇబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
-కంబాలపల్లి భరత్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్
ప్రజలు సీజనల్ వ్యాధులతో ఆస్పత్రికెళ్తే అక్కడ ఎలాంటి మందులు అందుబాటులో ఉండడంలేదు. దీంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ దవాఖానకు వచ్చే పేదలకు సరిపడా మందులను అందించాలి.
-బుగ్గరాములు, సీపీఎం మండల కార్యదర్శి