రంగారెడ్డి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. అధికారులు ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు బోసిపోయాయి. కేంద్రా ల్లో ని నిర్వాహకులు అనేక ఆంక్ష లు, కొర్రీలు విధించడంతో చాలామంది రైతులు వ్యాపారులు, మధ్యదళారులను ఆశ్రయించారు. తక్కువ ధరకు తమ పంటను అమ్ముకున్నారు. దీంతో జిల్లాలో అనుకున్న టార్గెట్‌కు అధికారులు చాలా దూరంలో ఉన్నారు. ఖరీఫ్‌లో జిల్లాలో 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 7,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కాగా జిల్లాలో 1,38,000 ఎకరాల్లో రైతు లు వరి పంటను సాగు
జిల్లాలో 8,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే అందులో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 7,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. మిగిలిన ధాన్యం వ్యాపారులు, మధ్యదళారుల చేతుల్లోకి వెళ్లింది. కొనుగోలు కేంద్రాల్లో అక్కడి నిర్వాహకులు విధించే ఆం క్షలు, కొర్రీలను తట్టులేక.. తక్కువ ధరకే తమ పంటను దళారులకు అన్న దాతలు విక్రయించి నష్టాల పాలయ్యారు.
ప్రభుత్వం సన్నా రకానికి బోనస్‌గా రూ.500 ఇస్తామని ప్రకటించినా చాలామంది రైతులకు బోనస్ రా లేదు. మరోవైపు అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు స్థలం లేక కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే తేమ శాతం అధికంగా ఉన్నదని.. అక్కడి నిర్వాహకులు కొనకుండానే తిరిగి ఇండ్లకే పంపించారు. అలాగే, ఎక్కువ మంది కౌలురైతులే ఉండడంతో వారికి పాస్‌బుక్కులు లేక ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లలేక మధ్యదళారులకే విక్రయించారు. ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా రైతులకు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూర లేదు. జిల్లాలో ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, మహేశ్వరం, ఆమనగల్లు లాంటి ప్రాంతాల్లో కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటైనా రైతులు ఆ కేంద్రాల కంటే దళారుల వద్దకే అధికంగా వెళ్లారు.