కందుకూరు, అక్టోబర్ : విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కందుకూరు పోలీస్ స్టేషన్ సీఐ సీతారాం కోరారు. శుక్రవారం మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసినసమావేశంలో మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థులు డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని కోరారు.
విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని పేర్కొన్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ముందుకు రావాలని వివరించారు. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయని పేర్కొన్నారు. డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడితే మనం ఏం చేస్తున్నామో, తెలియదని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లేక్చరర్లు,పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.