Chevella | చేవెళ్ల టౌన్, జూన్ 3 : రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య కోరారు. చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయములో కృష్ణయ్య మాట్లాడుతూ.. భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని తెలిపారు. 4వ తేదీన చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ, తంగడపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలోని రైతులు ఈ రెవెన్యూ సదస్సులో పాల్గొని తమ భూమి సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సదస్సులు ప్రతి గ్రామములో 20వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు.