షాబాద్, నవంబర్ 6: ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెప్పే కళ్లబొల్లి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితుల్లో లేరని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని చిన్నసోలీపేట్, పెద్ద సోలీపేట్, మద్దూరు, హైతాబాద్, పెద్దవేడు, నాందార్‌ఖాన్‌పేట్, దామర్లపల్లి, సాయిరెడ్డిగూడ, లింగారెడ్డిగూడ గ్రామాల్లో జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో భారీ ర్యాలీలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ…తెలంగాణలో 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ పదేండ్ల కాలంలో చేసి చూపించినట్లు తెలిపారు. గతంలో పలుమార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేయలేదని, నేడు ఓట్ల కోసం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, సబితారెడ్డి సహకారంతో చేవెళ్ల నియోజకవర్గంలోనే షాబాద్ మండలానికి పెద్ద ఎత్తున కంపెనీలను తీసుకువచ్చినట్లు తెలిపారు. జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ… మారుమూల గ్రామాలకు బీటీ రోడ్లు వేయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓటు అడుగుతామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు గూడూరు నర్సింగ్‌రావు, చల్లా శ్రీరాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు శేరిగూడెం వెంకటయ్య, నక్క శ్రీనివాస్‌గౌడ్, పోన్న నర్సింహారెడ్డి, డైరెక్టర్ సూద యాదయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్‌రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమ కారుడు దేశమళ్ల ఆంజనేయులు, పార్టీ మండల యూత్ అధ్యక్షుడు పీసరి సతీశ్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు బోరాంచ రమ్య, కావలి మల్లేశ్, శ్రీనివాస్‌గౌడ్, బోకుల లింగం, సులోచన, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఏండీ చాంద్‌పాషా, ఎంపీటీసీలు మామిడి లత, మధుకర్‌రెడ్డి, కరుణాకర్, మాజీ సర్పంచ్‌లు కావలి గోపాల్, పి. దర్శన్, బీఆర్ఎస్ ఆయా గ్రామాల అధ్యక్షులు బండారి దేవేందర్‌యాదవ్, గంగిడి భూపాల్‌రెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, డైరెక్టర్ చక్కటి దేవేందర్‌రెడ్డి, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు తొంట వెంకటయ్య పాల్గొన్నారు.
శంకర్పల్లి : మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే కాలె యాదయ్యను మరోసారి అధిక మెజార్టీతో గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి కోట్ల రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన యాదయ్యకే ప్రజలు మళ్లీ పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో నవాబ్‌పేట జడ్పీటీసీ జయమ్మ, శంకర్పల్లి జడ్పీటీసీ గోవిందమ్మ, కౌన్సిలర్ లక్ష్మమ్మ, శ్వేత, ఏఎంసీ చైర్మన్ పాపారావు, బీఆర్ఎస్ నాయకులు పాండురంగారెడ్డి, బాలకృష్ణ, గోపాల్, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మొయినాబాద్ :బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే నే పేద ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అప్పోజిగూడ గ్రామంలో సర్పంచ్ గోరుకంటి రాజు , ఉపసర్పంచ్ సురేశ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే మా ఓటు అంటూ ప్రజలు నినాదాలు చేశారు. కాలె యాదయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జయవంత్, బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింహ, నాయకులు రాఘవేందర్‌యాదవ్, చెన్నయ్యయాదవ్, దర్గ రాజు, ఎం మాణిక్యం, డేవిడ్, యాదగిరిచారి, తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మోకిలతండాలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు అత్యధిక సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, ఎంపీటీసీ సరిత తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్, నవంబర్ 6 : మారుమూల పల్లెలతో పాటు అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గడపగడప కూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలను వివరిస్తున్నారు. కొందుర్గు మండలం రేగడిచిల్కమర్రి, ముట్పూరు, టేకులపల్లి, ఉత్తరాసిపల్లి, భైరంపల్లి, మహాదేవ్‌పూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ర్టాన్ని సాధించడంతో పాటు ఇక్కడి ప్రజలకు సంపూర్ణ సంక్షేమాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్‌ను మరోమారు మనం సీఎంగా చూడాలని ప్రజలను కోరారు.
మోసపూరిత మాటలతో మభ్య పెట్టే కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పాలనలో కారు చీకట్లు తప్పా సంక్షేమం కానరాలేదన్న విషయం మనందరికీ తెలుసని అన్నారు. కారు మనదే.. సర్కారు మనదే అని నినాదాలు చేస్తు కారు గుర్తుకు ఓటు వేసి అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజేశ్ పటేల్, కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, శ్రీధర్‌రెడ్డి, దర్గా రాంచంద్రయ్య, మంజులారెడ్డి, బందులాల్, గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.