షాబాద్, డిసెంబర్ 29: గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో దిలీప్‌కుమార్ అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని జిలా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ప్రభాకర్‌తో కలిసి పరిశీలించారు. అదే విధంగా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామసభల ద్వారా ప్రజల నుంచి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈవో దిలీప్‌కుమార్ మాట్లాడుతూ…అర్హులైన లబ్ధిదారులందరూ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఆయా మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు అనురాధ, హిమబిందు, వెంకయ్య, సంధ్య, తహసీల్దార్లు చిన్నప్పలనాయుడు, గౌతమ్, ఎంపీవో హన్మంత్‌రెడ్డి, ఏవోలు వెంకటేశం, తులసి, రాగమ్మ, సర్పంచ్‌లు తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి, చల్లా సంధ్య, కృష్ణారెడ్డి, సుహాసిని, కృష్ణ, రాములు, మహేందర్‌రెడ్డి, అర్చన, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. చేగూరులో సర్పంచ్ సంతోష, కొత్తూరు మండలంలోని ఎస్.బి పల్లి సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పార్టీలకు అతీతంగా అర్హులకు పథకాలు అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, కొత్తూరు జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, ఎంపీపీలు ప్రియాంక, మధుసూదన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, ఎంపీటీసీలు చంద్రపాల్‌రెడ్డి, కుమారస్వామిగౌడ్ పాల్గొన్నారు.
కడ్తాల్ : ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజాపాలన కార్యక్రమ నియోజకవర్గ ప్రత్యేకాధికారి రామారావు అన్నారు. శుక్రవారం అన్మాస్‌పల్లి, చల్లంపల్లి, గాన్గుమార్లతండా, సాలార్‌పూర్ గ్రామాల్లో ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్మాస్‌పల్లి, చల్లంపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. తలకొండపల్లి మండలంలోని రాంపూర్, పడకల్, లింగరావుపల్లి, చెన్నారం, చుక్కాపూర్, మెదక్‌పల్లి, గ్రామాల్లో దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు ముంతాజ్, రంగారెడ్డి, ఎంపీడీవోలు రామకృష్ణ, శ్రీకాంత్, డీటీ వినోద్‌కుమార్, సర్పంచ్‌లు శంకర్, కృష్ణయ్యయాదవ్, హంశ్యా, విజయలక్ష్మి, వెంకట్రామిరెడ్డి, రమేశ్, ఎల్లమ్మ, స్వప్న, కిష్టమ్మ, ధరణి పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : అర్హులందరికీ కాంగ్రెస్ శ్రీకారం చుట్టిన 6 సంక్షేమ ఫథకాలు అందుతాయని జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. మండలంలోని బూర్గుల గ్రామంలో దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, ఎంఈవో శంకర్‌రాథోడ్, ప్రజాపాలన ఇన్చార్జి గిరిరాజు, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మౌనిక, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్ : దరఖాస్తు ఫారాలను జీరాక్స్ కేంద్రాలు, ఇతర దుకాణాల్లో విక్రయించవద్దని, వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఫారాలు అందుబాటులో ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాపాలన తీరును స్థానిక కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ధన్‌రాజ్, ఏఈ మల్లికార్జున్ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : ప్రజల క్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ వెంకన్న కార్యక్రమాన్ని పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బాబర్‌ఖాన్, చెన్నయ్య, దేవయ్య, రఘుమారెడ్డి, సత్యం పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం గ్యారెంటీల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 24 వార్డుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అన్నారు. తట్టిఅన్నారంలోని వార్డు కార్యాలయంలో స్థానిక కౌన్సిలర్లు దేవిడి గీత, పరశురాంనాయక్, కమిషనర్ రవీందర్‌రెడ్డి, వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పెద్దఅంబర్‌పేటలోని ఉన్నత పాఠశాలలో కౌన్సిలర్ పసుల రాజేందర్, కుంట్లూరు వార్డు కార్యాలయంలో కౌన్సిలర్ హరిశంకర్, 14వ వార్డులో తొండాపు రోహిణిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు దరఖాస్తులు స్వీకరించారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని ఎలిమినేడు, పోచారం గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ కృపేశ్, వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని బాలికల ఉన్నత పాఠశాలలో దరఖాస్తుల స్వీకరణను మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ధరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జోరుగా సాగుతున్నది.
ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీలోని 4,5,6 వార్డుల్లో , మండల పరిధిలో చింతలపల్లి, మంగళపల్లి గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను అధికారులు, సిబ్బంది స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నేనావత్ అనిత, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, ఏడీఈ శ్రీనివాసులు, తహసీల్దార్ లలిత, ఎంపీడీవో ఫారూఖ్ హుస్సేన్,కమిషనర్ శ్యామ్‌సుందర్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఏఈలు సీతారం, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : మండలంలోని బాటసింగారం, బండరావిరాల గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ రేఖ, జడ్పీటీసీ బింగిదాస్గౌడ్, తహసిల్దార్ రవీందర్దత్తు, ఎంపీడీవో మమతాబాయి, సర్పంచ్‌లు ఎర్రవెల్లి లతశ్రీ, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ కేశెట్టి వెంకటేశ్, దంతూరి అనిత పాల్గొన్నారు.
దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. శుక్రవారం జిల్లాలో 76,838 దరఖాస్తులు అందాయి. వాటిలో గ్రామ పంచాయతీల్లో 34,366 దరఖాస్తులు ఉండగా.. మున్సిపాలిటీల్లో 42,472 దరఖాస్తులు వచ్చాయి.
-ఇబ్రహీంపట్నం :