Tanduru | తాండూరు రూరల్, మే 6 : బాల్యవివాహాలు జరిపిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తాండూరు సీడీపీవో శ్రీలక్ష్మి హెచ్చరించారు. బాలికలకు 18 ఏండ్లు నిండకముందే వివాహం జరిపిస్తే తల్లిదండ్రులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మగవారికి 21 ఏండ్లు నిండి ఉండాలని తెలిపారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వివాహాలకు సహకరించే వారిపై కూడా చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. తాండూరు ప్రాజెక్టు పరిధిలో 9 బాల్యవివాహాలను అడ్డుకుని, వారిపై కేసు పెట్టామన్నారు. బాల్యవివాహాలు జరిపిస్తే వారికి రెండు సంత్సరాలు జైలు శిక్షతోపాటు లక్ష రూపాయాల జరిమానా విధిస్తారని హెచ్చరించారు. ఎవరైన బాల్యవివాహాలు జరిస్తే టోల్ ఫ్రీ నెంబరు 1098, 181, 100కి కాల్ చేయాలని సూచించారు.