వికారాబాద్, మే 23 : చైల్డ్ పోర్న్ వీడియోలను చూసి, సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన వ్యక్తులపై చన్గోముల్, పరిగి ఠాణాల్లో కేసులు నమో దు చేసినట్లు వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల కొందరు వ్యక్తులు చైల్డ్ పోర్న్ వీడియోలను చూసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇటువంటి చర్యలు చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం లేదా గూగుల్లో వాటి కోసం వెతకడం వంటి చర్యలను జిల్లా పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. ఇది సైబర్ నేరాల పరిధిలోకి వస్తుందన్నారు.