చేవెళ్ల రూరల్, డిసెంబర్ 16 : నేషనల్ హైవే 163 పెండింగ్ పనుల విషయంలో ప్రభుత్వం, అధికారులు అన్నీ అబద్ధాలే చెబుతున్నారని.. కనీసం ఎన్టీజీ అడిగిన రిపోర్టులూ సబ్మిట్ చేయలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం మండలంలోని కేసారం పరిధి బృం దావన్కాలనీలో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు పనులు చేపట్టాలని నాలుగైదు నెలలుగా తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా మని.. నిరసన తెలిపిన ప్రతిసారీ అధికారులు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకునేందుకు కొందరు లీడర్లు, పాత్రికేయులతో కలిసి డిసెంబర్ 13న చెన్నై ఎన్జీటీలో ఫైనల్ హియరింగ్ కు వెళ్లామని..అక్కడికెళ్లాక అధికారులు ఇన్నాళ్లు చెప్పింది అబద్ధమని తమకు అర్థమైందన్నారు. ఈ రోడ్డు స్టేట్ హైవేస్ నుంచి నేషనల్ హైవేగా అప్‌గ్రేడ్ అయ్యిందని, ఈ మేరకు 2018-19లో డీపీఆర్ తయారు చేసి టెండర్లు ఆహ్వానించాలని నేషనల్ హైవే అధికారులు స్థానిక ఆర్అండ్బీ అధికారుల కు పంపించారన్నారు. ఆ తర్వాత 2021లో ఈ రోడ్డు మంజూరైందని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారని గుర్తుచేశారు.
ఎన్టీజీ వెళ్లిన స్వచ్ఛంద సంస్థ
తర్వాత ‘సేవ్ బనియన్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వారు ఎన్టీజీకి వెళ్లారు. దీనిపై 2023 నవంబర్6న ఎన్జీటీ క్లియర్ డైరెక్షన్ ఇచ్చిందన్నారు. అయితే ఈఐఏ(ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్) రిపోర్ట్‌ను 4 నెలల్లో సబ్మిట్ చేసి పనులు ప్రారంభించుకోవ చ్చునని సూచించిందన్నారు. కానీ, ఇప్పటివరకు వారు సబ్మిట్ చేయలేదని, మొన్న ఎన్టీటీకి వెళ్లినప్పుడు జడ్జిలు అడిగితే తెల్లమొహం వేశారన్నారు. దీంతో కొత్తగా జూలాజికల్ సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పి న్యాయమూర్తులు తీర్పును రిజర్వ్ చేశారన్నారు. రోడ్డు పనులు చేయిస్తే ఎంపీ, ఎమ్మెల్యేకు తానే సన్మానం చేస్తానని కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు. రోడ్డు పనుల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తే ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఆంజనేయులు, ప్రభాకర్, శ్రీధర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, దశరథ్, సులోచ, మాధవ్‌రెడ్డి, రాజు, ఆంజనేయులు గౌడ్, శివారెడ్డి, రవీందర్, విఘ్నేశ్గౌడ్, అబ్దుల్ ఘని, రామాగౌడ్, బ్యాగరి సుదర్శన్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి
నవాబుపేట : మండలంలోని అన్ని గ్రామాల్లోని బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని.. కష్టపడిన ప్రతి కార్యకర్తకూ పార్టీ అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఉంటుందని బీఆర్ఎస్ రాష్ర్ట నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో జరుగుతున్న మాణిక్‌ప్రభు స్వామి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవాబుపేట బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు పార్టీ జెండాను ఆవి ష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఏడాది దాటినా ఇంకా రైతుభరోసా ఇవ్వలేని దుస్థితిలో రేవంత్ సర్కారు ఉన్నదని మండిపడ్డారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు సమయానికి వచ్చేవని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు.
అంతకుముందు బీఆర్ఎస్ నవాబుపేట మండలాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ నాల్గో విడతతో అందరి పంట రుణాలను మాఫీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నదని మండిపడ్డారు. నాల్గో విడతలో ఎంతమంది బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యిందో చెప్పే దమ్ము సర్కారుకు ఉందా..? అని సవాల్ విసిరారు. ప్రభుత్వ మోసపూరిత హామీలను ప్రజలకు వివరించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం ఏమిటో చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, ప్రకాశం, నాగరాజు, సామ్యూల్, మహేందర్, బాల్‌రాజ్, రమేశ్, కృష్ణ, అశోక్, దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరగా వారికి కార్తీక్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ఆంజనేయులు, బీఆర్ఎస్ గౌరవాధ్యక్షుడు భరత్‌రెడ్డి, ప్రధాన సలహాదారు విజయ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్లు శాంతికుమార్, వడ్ల , కోశాధికారి జగన్‌రెడ్డి, పురుషోత్తంచారి, ముఖ్యసలహాదారు సయ్యద్‌గౌస్ తదితరులు పాల్గొన్నారు.