ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ఎవరో చేసిన తప్పు, ఎవరిదో నిర్లక్ష్యం ఒక కుటుంబానికి శాపంగా మారింది. విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన షాబాద్ ఠాణా పరిధిలోని ధ్యానహిత పాఠశాల సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. షాబాద్‌కు చెందిన దర్జీ సాయితేజ(18) గత ఆరు నెలలుగా షాబాద్ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో ఎలక్ట్రిషన్‌తో పాటు బిల్లింగ్ చేయడం నేర్చుకుంటున్నాడు.
షాబాద్, జూన్ 29 : ఎవరో చేసిన తప్పు, ఎవరిదో నిర్లక్ష్యం ఒక కుటుంబానికి శాపంగా మారింది. విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన షాబాద్ ఠాణా పరిధిలోని ధ్యానహిత పాఠశాల సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. షాబాద్‌కు చెందిన దర్జీ సాయితేజ(18) గత ఆరు నెలలుగా షాబాద్ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో ఎలక్ట్రిషన్‌తో పాటు బిల్లింగ్ చేయడం నేర్చుకుంటున్నాడు. కాగా.. సోమవారం ఉదయం మండల కేంద్రంలోని ధ్యానహిత పాఠశాల ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ చేడిపోవడంతో గమనించిన ఇద్దరు విద్యుత్తు సిబ్బంది సరఫరాను నిలిపేయించి సాయితేజను ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కించారు.
ప్రమాదవవాత్తు ఎర్రోనిగూడ నుంచి వెళ్తున్న విద్యుత్తు సరఫరా 11కేవీ వైర్ సంకెపల్లిగూడ సమీపంలో కిందివైరు పై తెగిపడింది. దీంతో విద్యుత్తు సరఫరా రిటన్ వచ్చింది. అది గమనించని సాయితేజ ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి వైర్లు తాకగానే తీవ్ర గాయాలై సగం శరీరం కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందా డు. గమనించిన ఇద్దరు సిబ్బంది విద్యుత్తు సరఫరాను నిలిపేయించి మృతదేహాన్ని కిందకి దింపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు ను దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేశ్ తెలిపారు. కాగా, ఈ ఘటన విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యమని.. పిల్లాడిన ట్రాన్స్ఫార్మర్ పైకి ఎలా ఎక్కిస్తారని గ్రామస్తులు మండిపడుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

