తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆషాఢ మాస బోనాల పండుగను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని వీధుల గుండా వెళ్తుండగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
మహిళలు బోనాలను అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి చల్లని దీవెనతో వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని.. పిల్లాపాప అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. పలు పార్టీల ప్రజా ప్రతినిధులు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
– న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ