ఆమనగల్లు, మే 10 : అన్ని వర్గాల అభివృద్ధే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. బుధవారం ఆమనగల్లు మండల పరిధిలోని మంగళపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గౌడ సంక్షేమ భవనానికి భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీసింగ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆత్మ గౌరవానికి ప్రతీక కుల సంఘ భవనాలని అన్నారు.
ప్రభుత్వం కుల సంఘ భవనాలను నిర్మించడానికి పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. కుల వృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదిగేలా సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. కుల సంఘ భవనాలు పేదలు శుభకార్యాలతోపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగపడుతాయని వారు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, నల్గొండ విజిలెన్స్ సీఐ చరమందరాజు, చింతలపల్లి ఉపసర్పంచ్ మహేశ్‌గౌడ్, మాజీ ఉప సర్పంచ్ మురళి, గౌడ సంఘం నాయకులు అల్లాజీగౌడ్, కుమార్‌గౌడ్, రవిగౌడ్, బీఆర్ఎస్ నాయకులు రమేశ్‌నాయక్, మల్లేశ్‌నాయక్, స్థానిక నాయకులు సురేందర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, గౌడ సంఘం పెద్దలు పాల్గొన్నారు.