BC reservations | బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేదాకా పోరాడుతాం.. షాబాద్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షలు
స్థానిక సంస్థలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేదాకా పోరాడుతామని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి సభ్యులు అన్నారు.
షాబాద్, నవంబర్ 17: స్థానిక సంస్థలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేదాకా పోరాడుతామని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి సభ్యులు జడల రాజేందర్‌గౌడ్, తమ్మలి రవీందర్, కల్వకోల్ వెంకట్‌యాదవ్, రాపోలు నర్సింహులు అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు 37వ రోజుకు చేరుకున్నాయి.
సోమవారం చందనవెళ్లి గ్రామస్తులు రిలే దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ..బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని షాబాద్‌లో రిలే నిరహార దీక్షలు చేపట్టడం గొప్ప పరిణామన్నారు. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి హక్కుల సాధనకు ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ల సాధన సమితి సభ్యులు తదితరులున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

