కొడంగల్ : మండలంలోని ఉడిమేశ్వరం గ్రామ శివారులో కొనసాగుతున్న దౌల్తాబాద్ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు దసరా సెలవులు ముగిసిన అనంతరం ఆలస్యంగా వచ్చారంటూ మంగళవారం అనుమతించకుండా ఉపాధ్యాయులు గేటును మూసేశారు. దీంతో విద్యార్థులు ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు బయటే పడిగాపులు కాశారు.
ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడడంతో వారిని లోనికి అనుమతించారు. టీచర్లు విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్, ఆధార్ అప్డేట్ చేయించుకుని రావాలని సూచించారని.. అవి చేయించుకుని వచ్చే సరికి ఆలస్యమైందని విద్యార్థుల తల్లిదండ్రులు వివరించారు.