చేవెళ్లటౌన్, జూన్ 7: చేవెళ్ల పట్టణ కేంద్రంలో బక్రీద్ పండుగను ముస్లీం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మజీద్ కమిటి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముస్లీం సోదరులకు చేవెళ్ల మండల నాయకులు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ అధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ముస్లీం సోదరులు తదితరులు పాల్గొన్నారు.