చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ల గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్ జహంగీర్, వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, ముడిమ్యాల, రామన్నగూడ సర్పంచులు శేరి స్వర్ణలతా దర్శన్, నడిమొల్ల లావణ్య శంకర్, ఊరెళ్ల ఉప సర్పంచ్ విఠలయ్య, ఊరెళ్ల గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు చాకలి యాదయ్య, నాయకులు అంజయ్య, ప్రభు పాల్గొన్నారు.