Mysigandi | కడ్తాల్, జూన్ 27 : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయ ఆవరణలో శాక్తేయ మొక్కుబడులు రశీదులు వసూలు చేసుకునేందుకు, శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో అధికారులు బహిరంగ వేలం పాటను నిర్వహించారు. జిల్లా దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు మోహన్రావు ఆధ్వర్యంలో శాక్తేయ మొక్కుబడులు రశీదులు వసూలు చేసుకునేందుకు నిర్వహించిన వేలం పాటలో మొత్తం ఐదుగురు పోటీ పడగా, మైసిగండి గ్రామానికి చెందిన రమావత్ అమృనాయక్ అత్యధికంగా రూ.20,80,000లకు దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఈవో స్నేహలత, ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలీ పంతూనాయక్, నిర్వాహకులు భాస్కర్నాయక్, అరుణ్నాయక్, అర్చక సిబ్బంది యాదగిరి, కృష్ణ, చంద్రయ్య, రాములు, శ్రీనివాసులు, వెంకటేశ్, నాయకులు సుమన్నాయక్, నరేశ్, శివరాం, యాదగిరి, చందు, అమృనాయక్, రాజునాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.