బొంరాస్‌పేట, జనవరి 14 : రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాండూరు డీఎల్పీవో శంకర్ నాయక్ అన్నారు. శనివారం బొంరాస్‌పేట మండలంలోని బొంరాస్‌పేట, మేడిచెట్టుతండా, నాందార్‌పూర్, దుద్యాల మండలంలోని చిల్ముల్మైలారం, సాగారంతండా, ఎక్కచెర్వుతండా, చెట్టుపల్లితండాల్లో పర్యటించి కంటి వెలుగు కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. వైద్య సిబ్బంది ఒక్కో గ్రామంలో మూడు నుంచి ఐదు రోజులపాటు ఉండే అవకాశం ఉన్నందున వారు ఉండేందుకు మౌలిక వసతులు ఉన్న భవనాలను ఆయన పరిశీలించారు. ఎంపిక చేసిన భవనాలు, పరిసరాలను పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులను డీఎల్పీవో ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పాండు, దుద్యాల తాసిల్దార్ భీమయ్యగౌడ్, ఆర్ఐ రవినాయక్, వైద్యులు హేమంత్‌కుమార్, శ్రీకాంత్, హెల్త్ సూపర్వైజర్ మణిమాల పాల్గొన్నారు.
పట్లూర్ను సందర్శించిన డీఎల్పీవో
మర్పల్లి : మండల పరిధిలోని పట్లూర్ గ్రామ పంచాయతీని డీఎల్పీవో అనిత శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో మహేశ్‌కుమార్, సర్పంచ్ ఇందిరాఅశోక్, పంచాయతీ కార్యదర్శి సంతోష, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అశోక్, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో ..
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని వివిద గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించే సెంటర్ల వివారలను అధికారులు సేకరించారు. కులకచర్ల, చౌడాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సెంటర్లు నిర్వహించే గ్రామాల వారీగా వివరాలు సేకరించి కులకచర్ల పీహెచ్సీలో సీహెచ్‌వో చంద్రప్రకాశ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల మండల ప్రత్యేక అధికారి హనుమంతరావు, ఎంపీడీవో నాగవేణి, చౌడాపూర్ మండల ప్రత్యేక అధికారి ఉపేందర్‌రెడ్డి, కులకచర్ల ఎంపీవో కరీమ్, పంచాయతీ కార్యదర్శులు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి
కోట్‌పల్లి : కంటి వెలుగును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రామచందర్ అన్నారు. శనివారం మండల పరిధిలోని ఇందోల్ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 18 నుంచి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
కంటి వెలుగు ప్రదేశాల పరిశీలన..
ధారూరు : మండల పరిధిలోని నాగసముందర్, రుద్రారం, గట్టేపల్లి గ్రామాల్లో నిర్వహించే కంటి వెలుగు ప్రదేశాలను ధారూరు ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ భువనేశ్వర్, ఎంపీవో షఫీఉల్లా, ఆర్ఐ నవీణ పరిశీలించారు. శనివారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధారూరు మండలంలో ఈ నెల 18 నుంచి నిర్వహించే రెండో విడుత కంటి వెలుగు ప్రదేశాల్లో కనీస సౌకర్యాలను ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారి వెంట ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.