షాద్‌నగర్, జనవరి 7 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కొందుర్గు మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. క్రీడలతో ప్రాంతాలకు, క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని చెప్పారు. ఇష్టమైన క్రీడల్లో రాణించాలని సూచించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించడం పట్ల టోర్నీ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజేశ్‌పటేల్, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.