ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు బాధితులకు శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సీఎం రిలిఫ్ ఫండ్ ద్వారా మంజురైన చెక్కులను పంపిణీ చేశారు. మాడ్గుల మండలంలోని ఫిరోజ్ నగర్‌కు చెందిన రమేశ్‌కు రూ. 2లక్షల ఎల్వోసీ, తలకొండపల్లి మండలంలోని మెదక్‌పల్లికి చెందిన సంతోష్‌కు రూ. 65వేలు, ఆమనగల్లు మండలంలోని సింగంపల్లికి చెందిన ప్రశాంత్‌కు రూ. 60వేలు, మాడ్గుల మండలంలోని కొరతండాకు చెందిన పార్వతికి రూ. 45వేల చెక్కులను ఆయన నివాసంలో అందజేశారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీలు అనంతరెడ్డి, శంకర్‌నాయక్, సర్పంచులు రమేశ్‌రెడ్డి, యాదిరెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ సత్తిరెడ్డి పాల్గొన్నారు.