ఆమనగల్లు, జనవరి 4 : మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్ తెలిపారు. బుధవారం మున్సిపాలిటీలోని 13వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ దుర్గయ్యతో కలిసి చైర్మన్ రాంపాల్ నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాంపాల్ నాయక్ మాట్లాడుతూ ప్రజలకు తాగునీటికి, పారిశుధ్య కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మణ్, కృష్ణాయాదవ్, చెన్నకేశవులు, విజయకృష్ణ, విక్రమ్, నాయకులు శ్రీకాంత్సింగ్, గోరటి నర్సింహ, బైకాని శ్రీశైలం, కాలనీవాసులు ప్రకాశ్, లక్ష్మణ్, గాజుల శ్రీను పాల్గొన్నారు.