రంగారెడ్డి, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియపైనే అందరూ దృష్టి సారించారు. మంగళవారం జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్మోహన్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ల రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చి నట్లు తెలిసింది. కాగా ఆ జాబితాను బహిర్గతం చేసే విషయంలో అధికారులు గోప్యంగా వ్యవహరిస్తు న్నా రని నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లపై ఆశావహులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. బీసీలకు కులగణన కోటా, అలాగే, మహిళలకు సీట్ల ఖరారు వంటి ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలో ఉన్న 21 జడ్పీటీసీలు కేటగిరీల వారీగా విభజించి కలెక్టర్కు నివేదిక అందజేసినట్లు సమాచారం. అలాగే, ఆయా డివిజన్ల పరిధిలోని పంచాయతీ వార్డు రిజర్వేషన్ల ప్రక్రియనూ ఆర్డీవో స్థాయిలో పూర్తిచేసి ఆ నివేదికను కలెక్టర్కు అందజేసినట్లు తెలిసింది.
గ్రామపంచాయతీలు 526
వార్డులు 4,568
పోలింగ్ కేంద్రాలు 4,582
మొత్తం ఓటర్లు 7,94,653
పురుషులు 3,99,404
మహిళలు 3,95,216
ఎంపీటీసీలు 230
జడ్పీటీసీలు 21