వరి కొయ్యలను కాల్చొద్దు..
వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. సారవంతమైన భూమి దెబ్బతింటున్నది. రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరి కొయ్యల మిగులు అవశేషాలతో సిరులు సంపాదించవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
- అవగాహన లేమితో కాల్చుతున్న రైతులు
- భూమిలో కలియదున్నితేనే లాభం
- అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు
వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. సారవంతమైన భూమి దెబ్బతింటున్నది. రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరి కొయ్యల మిగులు అవశేషాలతో సిరులు సంపాదించవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరి కోత అనంతరం ఉండే గడ్డిని పశువులకు వాడడం లేదా కంపోస్టుగా మార్చుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
కొయ్యలను కాల్చడంతో అనర్థాలు..
పొలంలో కొయ్యలను కాల్చడం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అవగాహన లేమితో పంటకు ఎంతో మేలు చేసే కొయ్యలను భూమిలో కలియదున్నకుండా కాల్చివేసి భవిష్యత్ పంటలను నాశనం చేస్తున్నారని, వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నారని చెబుతున్నారు. కొయ్యలను కాల్చివేసే క్రమంలో భూమి గట్టిపడుతున్నదని, పొలాన్ని కలియదున్నడం వీలుకాదని పేర్కొంటున్నారు. కొయ్యలను కాల్చివేయడంతో భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు నాశనమవుతున్నాయని, దీంతో భూమి గుల్లగా మారే పరిస్థితి ఉందని చెబుతున్నారు.
నాట్లు వేసిన వేర్లకు సరిగ్గా పోషకాలు చేరవని, పైరు పెరగదని వివరిస్తున్నారు. రైతులు ఎక్కువగా యూరియాను వినియోగించాల్సి వస్తున్నదని, కానీ దాన్ని స్వీకరించి వేర్లకు అందించే సూక్ష్మజీవులు అప్పటికే అంతరించిపోవడంతో ప్రయోజనం లేకుండా పోతున్నదని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో యూరియాను అతిగా వాడడంతో భూమిలోకి చేరి భూగర్భ జలం విషతుల్యమవుతుందని, వాతావరణంలో అనేక మార్పులు కలుగుతాయని చెబుతున్నారు. కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ గాలిలో కలిసి వాతావరణం, జీవకోటిపైన తీవ్ర ప్రభావం చూపుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

కలియదున్నితేనే లాభం..
పంట కోసిన వెంటనే వరి కొయ్యలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నాలి. దీంతో కొయ్యలు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత సేంద్రియ ఎరువుగా మారుతుంది. వరి కొయ్యలను కలియదున్నడం, కుప్ప చేయడంతో నేలల్లో పగుళ్లు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. కొయ్యలను కలియదున్ని వెంటనే కుళ్లిపోయేలా పొటాషియం చల్లితే సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. తదుపరి పంటకు పోషకాలు విపరీతంగా పెరుగుతాయి.
వరి పంటను రైతులు గతంలో కొడవళ్లతో మొదళ్ల వరకు కోసేవారు. పశువుల పెంపకంపై కూడా రైతులు మక్కువ చూపేవారు. దీంతో వరి గడ్డిని కుప్పలుకుప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వచేసేవారు. ప్రస్తుతం సాగు విధానంలో అనేక మార్పులొచ్చాయి. పశువుల సంఖ్య తగ్గిపోవడంతో యంత్రాలను విరివిగా వినియోగిస్తున్నారు. హార్వెస్టింగ్ చేసే సమయంలో పైకి కోయడంతో కొయ్యలు పెద్దగా మిగిలిపోతున్నాయి.
అవసరమున్న రైతులు కొంత గడ్డిని కోసి తీసుకెళ్తున్నారు. మిగిలిన దానిని అక్కడే వదిలేస్తున్నారు. మళ్లీ దుక్కి దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు వరికొయ్యలతోపాటు గడ్డిని కూడా కాలబెడుతున్నారు. దీంతో అధిక నష్టాలు వచ్చే అవకాశమున్నదని, వరి కొయ్యలను తగులబెట్టొద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. – న్యూస్ నెట్వర్క్, డిసెంబర్ 7
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

