షాద్‌నగర్‌టౌన్, జనవరి 22 : ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి దరఖాస్తును తీసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు. షాద్‌నగర్ పట్టణంలోని 11, 22వ వార్డులో నిర్వహించిన వార్డు సభలను, సభల వద్ద ఏర్పాటు చేసిన జాబితాలను ఆర్డీవో సరితతో కలిసి బుధవారం పరిశీలించారు. వార్డు సభల వివరాలను మున్సిపల్ కమిషనర్ వెంకన్నను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి దరఖాస్తు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కొత్త రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే వారికి ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేయాలన్నారు.
షాద్‌నగర్‌టౌన్/షాద్‌నగర్‌రూరల్ : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నా రు. మున్సిపాలిటీలోని 13, 14వ వార్డులు, ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎల్లంపల్లిలో నిర్వహించిన వార్డు స భలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, మార్కెట్ క మిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, కమిషనర్ వెంకన్నతో కలిసి పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా విద్య, పోలీస్, ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. షాద్‌నగర్ ఆర్టీసీ డిపోలో డీఎం ఉష ఆధ్వర్యంలో మేకగూడ, సంఘీగూడ గ్రామాలకు వెళ్లేలా ఏర్పా టు చేసిన బస్సులను ఆయన ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో తహసీల్దార్ పార్థసారథి, ఎంపీడీవో బన్సీలాల్, మార్కెటు కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : మండల పరిధిలోని పోలేపల్లిలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యాట గీత, ఎంపీడీవో కుసుమ మాధురి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మేడిగడ్డ, మంగళపల్లి, రాంనుంతల, సీతారాంనగర్ తండా, శెట్టిపల్లి, శంకర్కొండతండా, సింగంపల్లితో పాటు మున్సిపాలిటీ పరిధిలోని , 5, 8,12, 15 వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామసభల్లో తహసీల్దార్ లలిత, ఎంపీడీవో కుసుమ మాధురి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ వసంత, ఆర్ఐలు చెన్నకేశవులు, సంపత్, సర్వేయర్ రవి, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు వార్డు అధికారులు పాల్గొన్నారు.
మాడ్గుల : మండల పరిధిలోని ఆవురుపల్లిలో ప్రభుత్వ అధికారులు గ్రామస్తుల సమక్షంలో గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి బుధవారం హాజరై రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాలపై ప్రజలకు వివరించారు. అర్హులందరూ వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కిషన్ రెడ్డి, అధికారులు ప్రజలు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : మండల పరిధిలోని అనాజ్‌పూర్‌లో నిర్వహించిన గ్రామ సభలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతా యన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
షాబాద్ : గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపడుతామని చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని ఎల్గొండగూడలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అపర్ణ, తహసీల్దార్ కృష్ణయ్య, డిప్యూటీ తహసీల్దార్ మధు, మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి వెంకటేశం, మాజీ సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
మంచాల : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని మంచాల సహకార సంఘం చైర్మన్ వెదిరె హనుమంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మం చాల మండల పరిధిలోని ఆరుట్ల, బోడకొండ, సత్తితండా, కొర్రవాని తండాల్లో ప్రత్యేకాధికారుల అధ్యక్షతన గ్రామా ల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. ఆరుట్లలో జరిగిన సభలో హనుమంత్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమం లో ఎంపీడీవో బాలశంకర్, తహసీల్దార్ కేవీవీ ప్రసాద్‌రావు, సహకార సంఘం డైరెక్టర్లు జనార్దన్‌రెడ్డి, జెనిగ వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల, శంకర్ పల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో రెండో రోజు గ్రామసభలు కొనసాగాయి. చేవెళ్ల మండల పరిధిలో అంతారం, తల్లారం, కేసారం, గుం డా ల, ఎనేపల్లి, రావులపల్లి, బస్తేపూర్, ఊరెళ్ల, కండవాడ, దామరగిద్ద, రేగడిఘనపూర్, నాన్చేరు, కుమ్మెర, రామన్నగూడ, శంకర్ పల్లి మండల పరిధిలో మోకిలా తండాలో గ్రామసభలు నిర్వహించారు. అంతారంలో తహసీల్దార్ కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, మోకిలా తండాలో జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహారావు అధ్యక్షతన సభ నిర్వహించారు.
ఆదిబట్ల : ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని రాందాస్‌పల్లి, పటేల్‌గూడ, బొంగుళూర్, మంగల్‌పల్లిలో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఆర్ఐ పుష్పలత, మున్సిపల్ మేనేజర్ రవి, కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.
కొత్తూరు : మండల, మున్సిపాలిటీ పరిధిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి అర్టీలను తీసుకున్నారు. ఇన్ముల్‌నర్వలో జరిగిన గ్రామ సభలో ఎంపీడీవో అరుంధతి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. 5వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య పాల్గొన్నారు. అలాగే 6వ నిర్వహించిన గ్రామ సభలో కౌన్సిలర్ హేమా దేవేందర్ పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ పాల్గొన్నారు.
నందిగామ : నందిగామ మండల పరిధిలోని అప్పారెడ్డిగూడ, మేకగూడ, మొదళ్లగూడ, కన్హ, తళ్లగూడ, మొత్కులగూడ, వెంకమ్మగూడలో బుధవారం అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. పేర్లు రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.