షాద్‌నగర్, జనవరి 12: షాద్‌నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని పలు కాలనీల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సీసీరోడ్డు పనులకు గురువారం జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాద్‌నగర్ మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులతో పట్టణం ఆదర్శం గా మారుతుందన్నారు.
మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సంబంధించిన కాలనీల్లో సీసీరోడ్లు, అంతర్గత మురుగుకాలువలు, వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించా రు. అదేవిధంగా ఇప్పటికే మున్సిపాలిటీలోని అన్ని వార్డు ల్లో మిషన్‌భగీరథ పైపులైన్ పనులు పూర్తిచేసినట్లు చెప్పా రు. పట్టణంలోని పరిగిరోడ్డు పోచమ్మ దేవాలయం వద్ద రూ. 70.5లక్షలు, వెంకటరమణ కాలనీ హాజిపల్లి రోడ్డు వద్ద రూ. 67.5లక్షలు, సేవాలాల్ దేవాలయం వద్ద రూ. 16 లక్షల నిధులతో సీసీరోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు సరితాయాదగిరియాదవ్, లతాశ్రీశ్రీశైలంగౌడ్, బచ్చలి నర్సింహ, నాయకులు జూపల్లి శంకర్, యాదగిరియాదవ్, శ్రీశైలం, నర్సింహులు, శేఖర్, రాజు, భిక్షపతి పాల్గొన్నారు.
బటర్‌ఫ్లై లైట్స్ ప్రారంభం
షాద్‌నగర్ పట్టణంలోని పరిగిరోడ్డు డివైడర్ మధ్యలో నూతనంగా ఏర్పాటు చేసిన బటర్ైఫ్లై లైట్లను బుధవారం రాత్రి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు డివైడర్ మధ్య లో ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై లైట్స్‌తో మున్సిపాలిటీ సుందరంగా మారిందన్నారు. డీఎంఎఫ్ నిధులు రూ. 50 లక్షలతో ఈ లైట్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, మాజీ చైర్మన్ విశ్వం, కమిషనర్ వెం కన్న, కౌన్సిలర్లు బచ్చలి నర్సింహులు, కృష్ణవేణి, అంత య్య, కో-ఆప్షన్ సభ్యుడు కిశోర్, నాయకులు జూపల్లి శంకర్, జమృత్‌ఖాన్, చెన్నయ్య, శేఖర్, శ్రావణ్, బాలు, యాదగిరి పాల్గొన్నారు.
దళితబంధు దేశానికే ఆదర్శం
షాద్‌నగర్‌టౌన్ : దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. దళిత పథకం ద్వా రా పట్టణానికి చెందిన చంద్రశేఖర్, ఫరూఖ్‌నగర్ మండలం నాగుపల్లి గ్రామానికి చెందిన యాదయ్య ఏర్పా టు చేసుకున్న దుకాణాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నదన్నారు. దళితబంధు ద్వారా మంజూరైన దుకాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యేను లబ్ధిదారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, మాజీ చైర్మన్ విశ్వం, మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, యుగేందర్ పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులు అందజేత
సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను గురువారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలోని చటాన్‌పల్లి చెందిన జైపాల్‌కు రూ. 20వేలు, చౌదరిగూడ గ్రామానికి చెందిన శివకోటయ్యకు రూ.16వేలు, తూంపల్లి గ్రామానికి చెందిన వనజకు 60 వేల అందజేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిలర్ రాజేశ్వర్, యుగేందర్, పాండురంగారెడ్డి, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.