అనుక్షణం అప్రమత్తం
సీజనల్ వ్యాధులపై వికారాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
- సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారుల చర్యలు
- వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 26 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు
- ప్రభుత్వ వసతిగృహాలు, స్కూళ్లపై ప్రత్యేక దృష్టి
- నివారణపై ఊరూరా అవగాహన కార్యక్రమాలు
వికారాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : సీజనల్ వ్యాధులపై వికారాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డెంగీ, మలేరియా, డయేరియా తదితర విష జ్వరాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లా అంతటా యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్, మురుగు కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేయడం వంటి పనులు చేపడుతున్నారు. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామ స్థాయి వరకు సీజనల్ వ్యాధుల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పరిశుభ్రత లోపించడం, కలుషితనీరు తాగడం వలన విషజ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున వ్యక్తిగత, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఎక్కడైనా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులు నమోదైతే వెంటనే రంగంలోకి వారికి సరైన చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా రానున్న నెలరోజుల్లోపు ప్రసవమయ్యే గర్భిణుల వివరాలను సేకరించి.. వాగులతో రాకపోకలు స్తంభించే గ్రామాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
26 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు..
డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఫీవర్ సర్వే నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫీవర్ కేసులు నమోదైన ఇంటికి చుట్టుపక్క 50 ఇండ్ల వరకు సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగీ లాంటి కేసులు నమోదైతే వెంటనే స్పందించేలా జిల్లావ్యాప్తంగా 26 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను జిల్లా వైద్యారోగ్య శాఖ నియమించింది. వ్యాధి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాస్థాయిలో ఒక టీం పనిచేయనుండగా, మిగతావి ప్రతి పీహెచ్‌సీకి ఒకటి చొప్పున అందుబాటోలు ఉండనున్నది. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఏరియా, సీహెచ్‌సీ, జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లను సిద్ధం చేశారు. ఫీవర్ సర్వేలో భాగంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి జ్వరం, జలుబు, తలనొప్పి తదితర లక్షణాల వివరాలను సేకరిస్తున్నారు. ఆయా వ్యాధి లక్షణాలను బట్టి నేరుగా ఇంటి వద్దనే ఉచితంగా మందులను అందిస్తున్నారు. మూడు, నాలుగు రోజులు మందులు వాడినా జ్వరం, జలుబు, తలనొప్పి తగ్గని వ్యక్తుల రక్త నమూనాలను సేకరించి వైద్య పరీక్షలకు పంపుతున్నారు. ఒకవేళ డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నిర్ధ్దారణ అయినైట్లెతే ప్లేట్లెట్స్ తగ్గకుండా ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచేలా జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. డయేరియాపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడంతోపాటు ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్లను అందిస్తున్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి…
జిల్లాలోని ప్రభుత్వ వసతిగృహాలు, స్కూళ్ల విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల వికారాబాద్, పరిగి ప్రభుత్వ వసతిగృహాల్లోని విద్యార్థులు అస్వస్థతకు గురైన దృష్ట్యా వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. హాస్టళ్లలో పనిచేసే నాన్-టీచింగ్ సిబ్బందితోనే ఎక్కువగా వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వంట మనుషులు, పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఫీవర్ ఉన్న వారిని తగ్గే వరకు ప్రత్యేక గదుల్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 81 హాస్టళ్లలో ఇప్పటివరకు 481 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి తగు చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు…
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన చర్యలు చేపట్టాం. డెంగీ కేసులు నమోదైతే సంబంధిత ప్రాంతాల్లో ఫీవర్ సర్వేను కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. ఏరియా, సీహెచ్‌సీ, జిల్లా దవాఖానల్లో ప్రత్యేకంగా ఐదు బెడ్లను సిద్ధంగా ఉంచాం. ఇండ్లు, స్కూళ్లు, హాస్టళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కాచి వడపోచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.
– డాక్టర్ పల్వన్‌కుమార్, డీఎంహెచ్‌వో
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

