తుర్కయాంజాల్, మార్చి 12: మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్‌చెరువును మంగళవారం కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు సర్వే చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ డీఈ ఉషారాణి మా ట్లాడుతూ మాసాబ్‌చెరువును పూర్తిస్థాయిలో సర్వే చేసి ఎఫ్టీఎల్ దిమ్మెలు లేని చోట వాటిని ఏర్పాటు చేయడంతోపాటు బఫర్ జోన్ పాయింట్‌ను గుర్తిస్తున్న ట్లు చెప్పారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినా.. అక్రమ నిర్మాణాలు వెలిసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తుర్కయాంజాల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఆర్ఐ భిక్షపతి, సర్వేయర్ జ్యోతి, ఇరిగేషన్ ఏఈ రాజా పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలానికి హద్దులు ఏర్పాటు చేస్తాం..
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 631లోని ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తామని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ రవీందర్ దత్తు అన్నారు. మంగళవారం ఆయన సర్వేనంబర్ 631లోని భూమిని ఆర్ఐ భిక్షపతితో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఈ భూమిలో కొంత కబ్జాకు గురికావడం తో సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేస్తామన్నారు.